తెలంగాణ

మిలాద్-ఉన్-నబీ 'జల్సా'.. నేటి సాయంత్రం నుంచి హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

హైదరాబాద్‌లో మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న 'జల్సా' కార్యక్రమం నేపథ్యంలో నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా దరుస్సాలం రోడ్డు పరిసర ప్రాంతాలలో భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉండటంతో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డెవిస్ ప్రకటించారు. ఈ ఆంక్షలు ఆగస్టు 25 సాయంత్రం 6 గంటల నుంచి ఆగస్టు 26 ఉదయం 4 గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు.

ఈ ఆంక్షల్లో భాగంగా మలక్‌పేట, బేగంబజార్ ఛత్రీ వైపు నుంచి వచ్చే వాహనాలను అలస్కా టీ-జంక్షన్ వద్ద ఎంజే బ్రిడ్జి, ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు. అదేవిధంగా మల్లెపల్లీ ఎక్స్-రోడ్స్, బోయిగూడ కమాన్ నుంచి వచ్చే వాహనాలను ఆగాపురా వద్ద టక్కర్‌వాడి, చార్మినార్ వైపు మళ్లిస్తారు. బజార్‌ఘాట్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ఏక్ మినార్ వద్ద నాంపల్లి రైల్వే స్టేషన్ రోడ్డు వైపు, మెహిదీపట్నం నుంచి వచ్చే వాహనాలను గోకుల్ నగర్ మీదుగా పంపిస్తారు.

కార్యక్రమానికి హాజరయ్యే భక్తులు, సందర్శకుల సౌకర్యార్థం పోలీసులు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను కేటాయించారు. నాలుగు చక్రాల వాహనాల కోసం సీతారాంబాగ్ ప్రభుత్వ డిస్పెన్సరీ, రాకెట్ గ్రౌండ్‌లో స్థలాలను కేటాయించగా, ద్విచక్ర వాహనాలను ఆఘా దర్గా, సర్దార్ బేగ్ దర్గా, పాన్ మండి రోడ్, ఎస్‌బీఐ రోడ్డు పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ చేసుకోవాలని సూచించారు.

ఈ ఆంక్షల సమయంలో అత్యవసర ప్రయాణాలు చేసే వారు దరుస్సలాం పరిసర మార్గాలను నివారించి, ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని పోలీసులు కోరారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనదారులు పోలీసుల సూచనలను పాటించి, నగరంలో వాహనాల రాకపోకల క్రమబద్ధీకరణకు పూర్తి సహకారం అందించాలని జాయింట్ సీపీ ఈ సందర్భంగా కోరారు.

#Milad Un Nabi Jalsa Hyderabad Traffic Restrictions#Darussalam Traffic Diversions August 2026#Hyderabad Police Advisory News Telugu#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి