భారతీయ ఎన్నికల వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక విశిష్టత ఉన్నది. 140 కోట్ల మంది ప్రజలు దేశంలో నివసిస్తున్నారు. అందులోనూ 60 శాతానికి పైగా యువత మనదేశంలో ఉన్నది.వరల్డ్ లేనే ఎక్కడా లేని విధంగా హ్యుమన్ రిసోర్స్ భారత్ సొంతం.అందుకే ప్రపంచ దేశాలు భారత్‌తో దోస్తీ కోసం ఎదురుచూస్తున్నాయి. ఇండియా స్నేహ హస్తం అందిస్తే తీసుకోవడానికి చాలా దేశాలు క్యూ కట్టాయి. ముఖ్యంగా భారత్ మార్కెట్ చైనా తర్వాత అతిపెద్దది.
అయితే, ఇటీవలి కాలంలో దేశప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు రాజకీయ నాయకులు మాట్లాడటం, వారి చేష్టల వలన అంతర్జాతీయ వేదికలపై భారత్ పరువుప్రతిష్టలు దిగజారుతున్నాయి.ప్రతిపక్ష నేతలు విదేశాలకు వెళ్లిన సమయంలో ఇండియాలో ఓటింగ్ ప్రక్రియ సరిగా జరగడం లేదని, ప్రజాస్వామ్యం లేదని, ప్రెస్ ఫ్రీడమ్ లేదని, డెడ్ ఎకానమీ అంటూ చేస్తున్న వ్యాఖ్యల కారణంగా విదేశీ పెట్టుబడులు సైతం వెనక్కి మళ్లుతున్నట్టు తెలుస్తోంది. భారత ప్రభుత్వాన్ని అస్థిర పరిచేలా కుట్రలు జరుగుతున్నట్టు విదేశాంగ ప్రతినిధులు పదే పదే అంతర్జాతీయ వేదికలపై చెబుతున్నారు.
ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు పదే పదే వస్తుండటంతో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. దేశంలో ఉపయోగించే ఈవీఎంలు ప్రభుత్వ రంగానికి చెందిన పరిశ్రమల్లో తయారవుతాయని.. ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై వంటి వైర్‌లెస్ టెక్నాలజీలతో అవి కనెక్ట్ కాలేవన్నారు.యూపీలోని లక్నో పర్యటనలో భాగంగా చారిత్రాత్మక ‘కొల్విన్ తాలూక్దార్స్ కాలేజ్’లో విద్యార్థులతో జరిగిన ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రజాస్వామ్య వ్యవస్థ,ఎన్నికల ప్రక్రియ,ఈవీఎంల నమ్మకం, యువ ఓటర్ల ప్రాముఖ్యతపై మాట్లాడారు. ఈవీఎంలు పూర్తిగా సురక్షితమైనవని స్పష్టంచేశారు. దేశంలో దాదాపు 100 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, ఇంత పెద్ద ఎత్తున ఎన్నికలు నిర్వహించడం ఒక బృహత్తర బాధ్యత అని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.
యువత చైతన్యంతో ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటేనే దేశ ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందన్నారు. ఈవీఎంలు, ఎన్నికల నిర్వహణ అత్యంత పారదర్శకమైన నిబంధనలు, చట్టాలకు లోబడి జరుగుతాయని వెల్లడించారు. కాగా,ఈఎంలను హ్యాక్ చేయొచ్చని ఆరోపిస్తుండగా.. గతంలో కేంద్రం ఎన్నికల సంఘం బహిరంగ ఆఫర్ ప్రకటించింది. హ్యాక్ చేసి చూపించాలని చెప్పగా.. ఎవరూ ముందుకు రాలేదు.


