International

హెచ్-1బీ వీసా రుసుము పెంపు.. భారత టెకీలపై తీవ్ర ప్రభావం!

రచన: Mamatha puppala••3 నిమిషాల పఠనం

అమెరికాలో ఉద్యోగం చేయాలని భావిస్తున్న విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ టెక్ రంగానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (DHS) భారీ షాక్ ఇచ్చింది. హెచ్-1బీ క్యాప్-సబ్జెక్ట్ పిటిషన్‌లపై అదనంగా 1,03,265 డాలర్ల (సుమారు ₹86 లక్షలకు పైగా) భారీ రుసుమును వసూలు చేయాలని ప్రతిపాదించింది.

అమెరికాలో ఉద్యోగం చేయాలని భావిస్తున్న విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ టెక్ రంగానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (DHS) భారీ షాక్ ఇచ్చింది. హెచ్-1బీ క్యాప్-సబ్జెక్ట్ పిటిషన్‌లపై అదనంగా 1,03,265 డాలర్ల (సుమారు రూ.86లక్షలకు పైగా) భారీ రుసుమును వసూలు చేయాలని ప్రతిపాదించింది. దరఖాస్తు దాఖలు చేసే సమయంలోనే ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని, ఇది ప్రస్తుతం అమల్లో ఉన్న సాధారణ ప్రాసెసింగ్ ఫీజులకు పూర్తిగా అదనమని స్పష్టం చేసింది.

అమెరికా ప్రభుత్వ ఖర్చులు, ఇమ్మిగ్రేషన్ కార్యక్రమాల నిర్వహణ, మోసాల గుర్తింపు, జాతీయ భద్రతా తనిఖీలు మరియు సాంకేతిక వ్యవస్థల ఆధునీకరణ కోసమే ఈ అదనపు రుసుమును ప్రతిపాదించినట్లు యూఎస్‌సీఐఎస్ (USCIS) పేర్కొంది. ఈ రుసుముల ద్వారా వార్షికంగా దాదాపు 8.8 బిలియన్ డాలర్ల రాబడి వస్తుందని భావిస్తున్నారు. అయితే లాభాపేక్ష లేని పరిశోధనా సంస్థలు, ఉన్నత విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగ పరిశోధనా సంస్థలకు ఈ క్యాప్-సబ్జెక్ట్ అదనపు రుసుము నుంచి మినహాయింపు కల్పించారు.

గతంలో ట్రంప్ ప్రభుత్వం 1,00,000 డాలర్ల ఫీజును ప్రతిపాదించగా, కోర్టులు దాన్ని నిలిపివేశాయి. పన్నులు విధించే అధికారం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం సవరించిన నిబంధనలతో ఈ నూతన రుసుము ప్రతిపాదనను ఫెడరల్ రిజిస్టర్‌లో పోస్ట్ చేసి 30రోజుల పాటు అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు.

మొత్తం హెచ్-1బీ వీసాలలో దాదాపు 70 శాతం భారతీయులే పొందుతున్నందున, ఈ నిర్ణయం భారతీయ ఐటీ రంగానికి పెద్ద దెబ్బ కానుంది. భారతీయ ఐటీ దిగ్గజాలు, కార్పొరేట్ కంపెనీలపై ఆర్థిక భారం విపరీతంగా పెరిగి, కొత్త రిక్రూట్‌మెంట్లు, అమెరికా వెళ్లే అవకాశాలు బాగా తగ్గే ప్రమాదం ఉంది.

 

#US#H1BVisa#FeeHike#IndianTechies#USCIS#DHS#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి