Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న సినిమాలలో ‘రణబాలి’ కూడా ఒకటి. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమాను సెప్టెంబర్ నెలలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, రష్మికకి గాయం అయిన కారణంగా ఇప్పుడు అక్టోబర్ 30కి విడుదల వాయిదా పడినట్టుగా తెలుస్తోంది.
పెళ్లి తర్వాత రష్మిక మందన్న భర్త విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ మంచి అంచనాలున్నాయి. అదీకాక ఈ సినిమా నుంచి విజయ్-రష్మికల లుక్ రిలీజై విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. అయితే, మైసా సినిమా షూటింగ్‌లో ఈ నేషనల్ క్రష్ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె నడుముకి బాగానే ఇబ్బంది కలిగింది.
దీంతో, డాక్టర్లు రష్మికకి 6 వారాల పాటు రెస్ట్ అవసరం అని సూచించారు. దాంతో, అటు మైసా షూటింగ్, ఇటు ‘రణబాలి’ షూటింగ్స్ ఆలస్యం అయ్యాయి. మిగతా తారాగణంపై షూటింగ్ చేస్తున్నా, మేయిన్ లీడ్ రష్మిక కాబట్టి, ప్రతీ విషయంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా, ‘రణబాలి’ సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు.
కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇంకా, రష్మికపై తీయాల్సిన సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. కనుక, ముందు అనుకున్న సెప్టెంబర్ 11న విడుదల చేయలేకపోతున్నారు. అందుకే, కొత్త విడుదల తేదీగా అక్టోబర్ 30ని అనుకుంటున్నారట. త్వరలో, దీనిపై అధికారికంగా మేకర్స్ నుంచి కన్‌ఫర్మేషన్ రానుంది. ఇక, ఈ సినిమాను టీ-సిరీస్..మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇదొక పీరియాడికల్ సినిమాగా రూపొందుతోంది.


