తెలంగాణ

ఆర్టీసీ భూముల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. ప్రభుత్వ నిర్ణయంపై వివాదం!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద బస్ భవన్ సమీపంలో ఉన్న అత్యంత కీలకమైన ఆరున్నర ఎకరాల ఆర్టీసీ భూమిని స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విలువైన ప్రాంగణంలో నిరుపేదల కోసం 'ఇందిరమ్మ ఇండ్లు' నిర్మించాలని సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది.

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద బస్ భవన్ సమీపంలో ఉన్న అత్యంత కీలకమైన ఆరున్నర ఎకరాల ఆర్టీసీ భూమిని స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విలువైన ప్రాంగణంలో నిరుపేదల కోసం 'ఇందిరమ్మ ఇండ్లు' నిర్మించాలని సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది. గతంలో హైదరాబాద్-3 డిపోగా సేవలందించిన ఈ స్థలాన్ని, ప్రస్తుతం ఆర్టీసీ సంస్థ తమ నూతన బస్సుల ఛాసీ(బస్సు బాడీని మోసే కింది భాగంలోని ప్రధాన ఫ్రేమ్‌)లను నిలిపే యార్డుగా ఉపయోగిస్తోంది.

ఆర్టీసీ భూముల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. ప్రభుత్వ నిర్ణయంపై వివాదం!

ప్రభుత్వ ప్రతిపాదనపై స్పందించిన ఆర్‌టీసీ యాజమాన్యం ఒక ముఖ్యమైన లేఖను పంపింది. ప్రతిపాదిత స్థలంలో ప్రస్తుతం కొత్త భవనాలు అందుబాటులో ఉన్నందున, దానికి బదులుగా పాత భవనాలు ఉన్న ముషీరాబాద్-1 డిపో స్థలాన్ని ఇందిరమ్మ ఇండ్ల కోసం తీసుకోవాలని అందులో విజ్ఞప్తి చేసింది. అయితే ఆర్టీసీ యాజమాన్యం పంపిన ఈ ప్రతిపాదనా లేఖపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.

మరోవైపు, ఈ భూముల సేకరణపై న్యాయ, సాంకేతికపరమైన నిపుణులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆర్టీసీకి చెందిన స్థిర చరాస్తులను కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్‌లో చేర్చింది. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పెంపకం, విభజన అంశాలు పూర్తిగా తేలేంత వరకు ఈ భూములను ప్రభుత్వం నేరుగా స్వాధీనం చేసుకోవడం చట్టపరంగా కుదరదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

కేంద్రం పరిధిలోని 9వ షెడ్యూల్ అంశం కొలిక్కి రాకపోవడం, ఆర్‌టీసీ ప్రత్యామ్నాయ స్థలాన్ని సూచించడంతో ఈ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సందిగ్ధత నెలకొంది. ఆర్టీసీ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ముషీరాబాద్ స్థలాన్ని పరిశీలిస్తుందా? లేక పాత ప్రతిపాదనకే కట్టుబడి ఉంటుందా? అనేది వేచి చూడాల్సి ఉంది.

 

#IndirammaIndlu#TelanganaGovt#TSRTC#RTCBhavan#HyderabadHousing#TelanganaNews#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి