భిక్షాటన చేసే ఓ వృద్ధురాలి ఇంట్లో రూ.40 లక్షల నగదు లభ్యం కావడంతో అందరూ షాక్ అయ్యారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు చాలా చోట్ల వెలుగుచూస్తున్నాయి.జీవితకాలం భిక్షాటన చేస్తున్న కొందరు వృద్ధులు వారు ఉంటున్న ఇంట్లో డబ్బులను దాచడం,వాటిని తిరిగి ఖర్చు చేయకపోవడం వలన పెద్ద అమౌంట్‌గా మారుతోంది. భిక్షాటన చేసే సమయంలో కొందరు డబ్బులు ఇస్తుంటే.. మరికొందరు ఫుడ్ పెట్టిస్తుంటారు. దీంతో వారు అక్కడే కడుపు నింపుకుని డబ్బులు ఇంటికొచ్చాక దాచడం చేస్తుంటారు.
ఫలితంగా వారికి ఆ డబ్బును ఖర్చు చేసే అవసరం ఏర్పడటం లేదు. వారి బాగోగులు చూసుకోవడానికి ఎవరూ ఉండకపోవడంతో ఆ డబ్బును వినియోగించాలనే ఆలోచన సైతం ఎవరికి ఉండటం లేదు. దీంతో కొన్ని సంవత్సరాలు పొగు పడిన డబ్బులు రూ. లక్షల్లో లెక్క తేలుతోంది. భిక్షాటన చేసి చేసి వృద్ధులు మరణించాక ఇంట్లో చూస్తే గుట్టలుగా డబ్బు కట్టలు బయటపడుతున్నాయి.
https://x.com/greatandhranews/status/2091846884197626301?s=20
తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలోని మాండ్యలో వెలుగుచూసింది. స్థానికంగా ఉండే మసీదు వద్ద ఓ వృద్ధురాలి భిక్షాటన చేస్తూ జీవనం సాగించేంది. అయితే, ఏళ్లుగా మసీదు బయట భిక్షాటన చేస్తూ జీవించిన హూర్ అనే వృద్ధురాలు ఇటీవల మృతి చెందింది. అంత్యక్రియల అనంతరం ఆమె ఇంటికి వెళ్లిన స్థానికులకు గోనె సంచుల్లో భారీగా నగదు, నాణేలు కనిపించడంతో అంతా షాక్ అయ్యారు.
వాటిని లెక్కించగా..దాదాపు రూ.30-40 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. తనను కుటుంబ సభ్యులు పట్టించుకోవడం లేదని, భిక్షాటనే తన జీవనాధారమని హూర్ చెప్పేదని స్థానికులు తెలిపారు.ఆమె దాచుకున్న డబ్బును మసీదుకు విరాళంగా ఇవ్వాలని కొందరు సూచించగా.. భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బును స్వీకరించబోమని మసీదు కమిటీ తిరస్కరించినట్లు సమాచారం. చివరకు ఆమె సోదరుల్లో ఒకరు కుటుంబంతో వచ్చి డబ్బును తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఆమె బతికి ఉన్నప్పుడు పట్టించుకోని బంధువులు.. బుక్కెడు తిండిపెట్టని వారు.. ఆ వృద్ధురాలు మరణించాక తను భిక్షాటన చసి తెచ్చిన సొమ్మును తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
https://x.com/greatandhranews/status/2091846884197626301?s=20


