వైరల్ న్యూస్

viral : చెత్తలో పడేసిన చాక్లెట్ల కోసం ఎగబడిన జనం (వీడియో)

రచన: Kumar••4 నిమిషాల పఠనం

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతున్నది. తాజాగా కొందరు జనాలు చెత్త కుప్పలో పడేసినా చాక్లెట్ బాక్సులను ఎత్తుకెళ్లడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతున్నది. తాజాగా కొందరు జనాలు చెత్త కుప్పలో పడేసినా చాక్లెట్ బాక్సులను ఎత్తుకెళ్లడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అసలు వీళ్లు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఉచితంగా వస్తుందంటే చాలు.. ఎగబడి మరీ ఎత్తుకెళ్తారు అని కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

మరి ఇంత కక్కుర్తి పనికిరాదని కొందరు అంటుంటే.. భారతీయులకు కనీసం కామన్ సెన్స్ లేకుండా పోతుందని, చదువుకున్నవారు, చదువు లేని వారు కూడా అలాగే తయారవుతున్నారని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు మీద ఏదైనా పాల ప్యాకెట్ల వ్యాన్,కోళ్ల వ్యాన్, తీపి పానియాల వ్యాన్ పడిపోతే అందులోని మనుషులను కాపాడి ఆస్పత్రికి తరలించాల్సి బదులు.. స్టాక్ మొత్తం ఖాళీ చేసే పనిలో జనాలు నిమగ్నం అవుతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా చెత్తలో పడేసిన ఎక్స్‌పైరీ చాక్లెట్ల కోసం జనం ఎగబడిన దృశ్యాలు చూసి చాలా మంది నోరెళ్లబెడుతున్నారు.ఈ ఘటన ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని పంకి ప్రాంతంలోచోటు చేసుకుంది. కాలం చెల్లిన చాక్లెట్లను ఓ షాప్ సిబ్బంది సమీపంలోని చెత్తకుప్పలో పడేయగా.. గమనించిన ప్రజలు.. వెంటనే ఆ చాక్లెట్లు ఎత్తుకెళ్లడం కోసం క్యూ కట్టారు. చెత్తలో ఎందుకు పడేశారని ఆలోచించకుండా.. అందినకాడికి పట్టుకెళ్లారు.

అవి ఎక్స్‌పైర్ అయిన చాక్లెట్లు అని చెప్పినా వినిపించకుండా జనం ఎత్తుకెళ్లినట్టు సమాచారం.ఒకరిని చూసి మరొకరు.. బ్యాగుల్లో,డబ్బాల్లో చాక్లెట్లను పట్టుకుని వెళ్లడం గమనార్హం. చదువుకున్న వాళ్లు సైతం ఏదో బంగారం అన్నట్టు తీసుకెళ్లడం ఇంకా విడ్డూరం కలిగించింది.చదువు రానికి చెప్పాల్సింది పోయి వీరే చెత్తలో పడేసిన చాక్లెట్ల కోసం ఎగబడటం అందరినీ విస్మయానికి గురిచేసింది.ఇలాంటి వారి వల్లే దేశం పరువుపోతుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

https://x.com/pulsenewsbreak/status/2092067184902369746?s=20

#expired chocolates#people#collected#utterpradesh#viral video
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి