తెలంగాణ

TG : తొలి ప్రపంచ ఓపెన్ తైక్వాండో అక్కాతమ్ముడి సత్తా.. ఒకేసారి 4 పతకాలు

రచన: Kumar••4 నిమిషాల పఠనం

రాష్ట్రంలోని విద్యార్థులు అద్భుతం సృష్టించారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనడం ఇదే తొలిసారి అయినప్పటికీ ఎక్కడ అదరలేదు, బెదరలేదు. పతకాల వేటే లక్ష్యంగా ముందకు కదిలారు.ప్రత్యర్థులను చిత్తుచేసి రాష్ట్రానికి మెడల్స్ అందించారు.

రాష్ట్రంలోని విద్యార్థులు అద్భుతం సృష్టించారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనడం ఇదే తొలిసారి అయినప్పటికీ ఎక్కడ అదరలేదు, బెదరలేదు. పతకాల వేటే లక్ష్యంగా ముందకు కదిలారు.ప్రత్యర్థులను చిత్తుచేసి రాష్ట్రానికి మెడల్స్ అందించారు. అక్కాతమ్ముడు ఈ ఘనత సాధించడం విశేషం. దీంతో తెలంగాణ విద్యార్థుల ప్రతిభ ప్రపంచదేశాలకు తెలిసినట్టు అయ్యింది. వివరాల్లోకివెళితే..

తెలంగాణలో నిర్వహించిన తొలి ప్రపంచ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌–2026లో అక్కా తమ్ముడు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఒకేసారి నాలుగు పతకాలు సాధించారు. గచ్చిబౌలి స్టేడియంలో ఆగస్టు 21 నుంచి 23 వరకు జరిగిన ఈ అంతర్జాతీయ పోటీల్లో భారత్ తరఫున పాల్గొన్న మాలోత్ సాన్వి రియా, మాలోత్ ఆరుష్ మిథుల్ సత్తా చాటారు.

దేశంలోని 22 రాష్ట్రాలతో పాటు 12 దేశాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. 9వ తరగతి చదువుతున్న సాన్వి రియా 14 ఏళ్లలోపు క్యోరుగి విభాగంలో స్వర్ణ పతకం, పూమ్సే విభాగంలో కాంస్య పతకం సాధించింది. సాన్వి రియా తమ్ముడు, 3వ తరగతి విద్యార్థి ఆరుష్ మిథుల్ 8 ఏళ్లలోపు క్యోరుగి విభాగంలో స్వర్ణ పతకం సాధించగా, వేగవంతమైన పంచింగ్‌ విభాగంలో రజత పతకం గెలుచుకున్నాడు.

ఈ ప్రతిష్టాత్మక పోటీలను తెలంగాణ సాంకేతిక, నిర్వహణ విభాగం మేనేజర్‌, డైరెక్టర్‌ రాజు రాథోడ్ ఆధ్వర్యంలో అమికల్ క్రీడా అకాడమీ, అమికల్ క్రీడా సమాఖ్య, జేఆర్ అంతర్జాతీయ తైక్వాండో అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన విషయం తెలిసిందే. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో నాలుగు పతకాలు సాధించిన సాన్వి రియా, ఆరుష్ మిథుల్‌‌ను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కోచ్‌లు, కుటుంబ సభ్యులు, అభినందనలు తెలిపారు. తమ విద్యార్థుల విజయం తెలంగాణతో పాటు ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ (కొంపల్లి)కి గర్వకారణమని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.

#telangana#world taiquando compitation#4 medals#brother &sister
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి