ప్రపంచం

US : అమెరికా చదువులు మాకొద్దు.. భారత యువత సంచలన నిర్ణయం

రచన: Kumar••5 నిమిషాల పఠనం

అమెరికాలో చదవాలనే కోరికను భారతీయ విద్యార్థులు తగ్గించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడు అయ్యాక ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నవారిలో భారతీయులే ఉన్నారు. అక్కడ ఉద్యోగం చేస్తున్న వారు, చదువుకుంటున్న వాళ్లు, గ్రీన్‌కార్డు ఉన్నవారు సైతం ట్రంప్ తీసుకునే నిర్ణయాలకు వణికిపోతున్నారు.

అమెరికాలో చదవాలనే కోరికను భారతీయ విద్యార్థులు తగ్గించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడు అయ్యాక ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నవారిలో భారతీయులే ఉన్నారు. అక్కడ ఉద్యోగం చేస్తున్న వారు, చదువుకుంటున్న వాళ్లు, గ్రీన్‌కార్డు ఉన్నవారు సైతం ట్రంప్ తీసుకునే నిర్ణయాలకు వణికిపోతున్నారు. స్టూడెంట్ వీసా చార్జీలు పెంచడం, హెచ్ 1బీ వీసా మీద ఆంక్షలు, గ్రీన్ కార్డు ఉన్నవారికి సైతం ఆంక్షలు, రివ్యూలు చేస్తుండటంతో ఇండియన్స్ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఈ క్రమంలోనే అమెరికాలో చదువుకోసం ఏటా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గినట్టు తెలుస్తోంది. అక్కడి UG కోర్సుల్లో భారతీయ విద్యార్థుల దరఖాస్తులు 15 శాతం తగ్గినట్లు సమాచారం. యూఎస్‌లో ఇమ్మిగ్రేషన్ విధానాలు, వీసా నిబంధనలు కఠినతరం కావడంతో భారతీయ విద్యార్థుల ఉన్నత కలలు చెదిరిపోతున్నాయి. మంచి ఉద్యోగాలు సంపాదించాలని అమెరికాకు వెళ్తున్న వారు ఏదో ఒక షాపులో పార్ట్ టైం జాబ్స్ చేస్తూ చదువుకునేవారు. ఇప్పుడు అవన్నీ కష్టతరంగా మారాయి.

జాబ్స్ దొరకడం లేదని తెలుస్తోంది.పార్ట్ చేసేవారికి సైతం కఠిన ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది.ఫలితంగా ఇప్పటికే వెళ్లిన విద్యార్థులు రూం అద్దెలు, కాలేజీ ఫీజులు చెల్లించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే అమెరికాలోని 1,100కి పైగా విద్యాసంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 'కామన్ యాప్' విడుదల చేసిన తాజా రిపోర్టు ప్రకారం.. 2025-26 అకడమిక్ ఇయర్‌లో గతేడాదితో పోలిస్తే అమెరికా కాలేజీల్లో యూజీ ప్తరవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 15 శాతం తగ్గిందని తేలింది.

రాబోయే 2026-27 అకడమిక్ కోసం దరఖాస్తుల సంఖ్య పెరిగినప్పటికీ, మార్చి 1 నాటికి అంతర్జాతీయ దరఖాస్తుదారుల సంఖ్య 10 శాతం క్షీణించి చరిత్రలోనే అత్యధిక తగ్గుదలగా నమోదైనట్టు సమాచారం. యూఎస్‌లో ప్రపంచదేశాలతో పోలిస్తే భారతీయ విద్యార్థులే అత్యధిక శాతం వెళ్తుంటారు. తాజాగా విద్యార్థుల దరఖాస్తుల్లో క్షీణత నమోదు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. యూఎస్ ఇటీవల వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ గరిష్ట బస పరిమితిని నాలుగేళ్లకు పరిమితం చేయడం, గ్రాడ్యుయేషన్ తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ప్రోగ్రామ్‌కు సంబంధించిన ఫీజులపై అనిశ్చితి నెలకొనడమే ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అక్కడ ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని ఇక్కడి యువత యూఎస్ వెళ్లే నిర్ణయాలను మార్చుకుంటున్నట్టు తెలిసింది.

#america#indian students#applications#decrease#New visa rules
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి