National

Breaking : ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరికాదు : అలహాబాద్ హైకోర్టు

రచన: Kumar••4 నిమిషాల పఠనం

హిజాబ్ సంస్కృతి అనేది పాఠశాలల్లో వర్తింపజేయాలని ఓ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పాఠశాలలో తాను యూనిఫామ్‌తో పాటు తలకు హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని, ఈ మేరకు పాఠశాలకు ఆదేశాలివ్వాలని సదరు విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

హిజాబ్ సంస్కృతి అనేది పాఠశాలల్లో వర్తింపజేయాలని ఓ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పాఠశాలలో తాను యూనిఫామ్‌తో పాటు తలకు హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని, ఈ మేరకు పాఠశాలకు ఆదేశాలివ్వాలని సదరు విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఇస్లాంలో హిజాబ్ ధరించడం అత్యవసరమైన మతపరమైన ఆచారమని నిరూపించేందుకు వాస్తవ, చట్టపరమైన ఆధారాలను లేవని స్పష్టంచేసింది.

వివరాల్లోకివెళితే..యూపీ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌‌లో గల అత్తర్ సూయియా ప్రాంతంలో ఠాగూర్ పబ్లిక్ స్కూల్ ఉంది. అందులో చదివే ఓ విద్యార్థిని సుకైనా రిజ్వీ.. తన తల్లి ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేశారు. తాను పదవ తరగతి పూర్తి చేశానని, అదే స్కూళ్లో ఇంటర్‌లో చదవాలని అనుకుంటున్నానని.. అయితే, స్కూల్ యూనిఫామ్‌తో పాటు హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇచ్చేలా పాఠశాల యాజమాన్యాన్ని ఆదేశించాలని విద్యార్థిని కోర్టును అభ్యర్థించింది.

ఆగస్టు 21వ ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ ఇంద్రజీత్ శుక్రాతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఠాగూర్ పాఠశాలలో ఇతర విద్యార్థినులు, ముస్లిం మతానికి చెందిన అమ్మాయిలు కూడా హిజాబ్ ధరించడం లేదని ఫోటోల ద్వారా స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొంది. హిజాబ్ ధరించడం ఇస్లాంలో అత్యవసరమని పిటిషనర్ చెప్పడం కేవలం మాటలకు పరిమితం అయ్యిందని ధర్మాసనం భావించింది. దాన్ని నిరూపించేందుకు మత గ్రంథాలు కానీ, ఇతర ఆధారాలు కానీ సమర్పించలేదని ధర్మాసనం పేర్కొంది.

గతంలో ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా ప్రస్తావించిన అలహాబాద్ న్యాయస్థానం.. హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదని ఏకగ్రీవంగా అభిప్రాయానికి వచ్చింది. 2022లో కర్నాటక హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో తాము ఏకీభవిస్తున్నామని కోర్టు తెలిపింది. క్రమశిక్షణ, సంస్థాగత గుర్తింపు, పాఠశాలలో కుల,మత భేదం లేకుండా అందరూ సమానమే అని చాటి చెప్పేందుకు రూపొందించిన యూనిఫామ్ కోడ్‌ను మార్చాలని విద్యార్థులు పట్టుబట్టలేరని కోర్టు స్పష్టంచేసింది.రాజ్యాంగంలోని ఆర్టికల్- 25 మత స్వేచ్ఛ కింద సరైన వాస్తవ,చట్టపరమైన ఆధారాలు లేకుండా కేవలం వాదనల ఆధారంగా హక్కులను కోరడం సరికాదని కోర్టు తేల్చి చెప్పింది.

#hizab#school#uniform#allahabad highcourt#islaam
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి