తెలంగాణ

సోషల్ మీడియాపై సీఎం రేవంత్ ఫోకస్.. బీఆర్ఎస్‌కు చెక్ పెట్టేలా కాంగ్రెస్ కార్యాచరణ!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను అత్యంత సమర్థవంతంగా ఉపయోగిస్తోందని, దానికి సరైన రీతిలో చెక్ పెట్టకపోతే ఇబ్బందులు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టుకోవాలని, బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేలా కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం విస్తృతంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.

ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను అత్యంత సమర్థవంతంగా ఉపయోగిస్తోందని, దానికి సరైన రీతిలో చెక్ పెట్టకపోతే ఇబ్బందులు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టుకోవాలని, బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేలా కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం విస్తృతంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో జరిగిన సమావేశంలో సీఎం ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.

సోషల్ మీడియాపై సీఎం రేవంత్ ఫోకస్.. బీఆర్ఎస్‌కు చెక్ పెట్టేలా కాంగ్రెస్ కార్యాచరణ!

ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో రోజురోజుకూ వేగంగా మార్పులు వస్తున్నాయని, ఇది కేవలం టెక్నాలజీ యుగం మాత్రమే కాక ‘జెన్-జీ’ (Gen Z) యుగమని సీఎం గుర్తుచేశారు. సమయానికి తగినట్లుగా సాంకేతికతను వినియోగించుకోకపోతే రాజకీయంగా అవుట్‌డేట్ అయిపోయే ప్రమాదం ఉందన్నారు. సోషల్ మీడియా ప్రభావం ప్రజల్లో విపరీతంగా ఉందన్న ఆయన, ప్రతి నాయకుడు తమ పనులను, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను వేదికగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రచార సాధనాలు కూడా మారుతున్నాయని రేవంత్ రెడ్డి విశ్లేషించారు. ఒకప్పుడు ప్రాచుర్యంలో ఉన్న ఫేస్‌బుక్, ట్విట్టర్ (X) వంటి ప్లాట్‌ఫారమ్‌లు క్రమంగా పాతబడిపోతున్నాయని, ప్రస్తుతం యువత అంతా ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌లోనే హల్‌చల్ చేస్తోందని అన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరూ తక్షణమే ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్ అవ్వాలని, యువతను ఆకట్టుకునేలా రీల్స్. డిజిటల్ కంటెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పనులు చేయడమే కాకుండా వాటిని ఆధునిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడం ప్రస్తుత కాలంలో అత్యంత కీలకమని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.

#RevanthReddy#CongressSocialMedia#InstagramReels#BRS#GenZ#TelanganaPolitics#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి