International

US-Iran War: అమెరికా-ఇరాన్ వార్‌లో బిగ్ ట్విస్ట్!.. ఇక వెనక్కి తగ్గేదే లేదు..

రచన: Venu4 నిమిషాల పఠనం

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చేసిన ఈ ప్రకటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. మేము అమెరికాతో పూర్తిస్థాయి యుద్ధంలో ఉన్నాం అంటూ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చేసిన ప్రకటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

కాగా ఇరువర్గాలూకాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుచుకున్నాయి. దీంతో ప్రస్తుతం ఇరాన్-అమెరికాల మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. ఈ ఘర్షణకు మూలం కొత్తది కాదు. 1979 ఇరాన్ ఇస్లామిక్ విప్లవం నుంచి రెండు దేశాల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. 2020లో ఇరాన్ సైనికాధికారి ఖాసిం సోలైమనీ హత్య తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తమయ్యాయి.

ఇటీవల హర్మూజ్ జలసంధిలో కార్గో నౌకలపై దాడులు, అమెరికా వైమానిక దాడులు, ఇరాన్ క్షిపణి ప్రయోగాలు.. ఈ వైరాన్ని నేరుగా యుద్ధ వాతావరణంలోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం అమెరికా ఇరాన్‌కు చెందిన డ్రోన్ స్థావరాలు, క్షిపణి నిల్వలు, తీరప్రాంత నిఘా వ్యవస్థలు, నౌకాదళ సామర్థ్యాలపై వరుస దాడులు కొనసాగిస్తోంది.

మరోవైపు కువైట్‌లోని అమెరికా అరిఫ్జాన్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించామని, హిమార్స్ రాకెట్ వ్యవస్థను ధ్వంసం చేశామని ఇరాన్ ప్రకటిస్తోంది. అయితే ఆ క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నామని అమెరికా చెబుతోంది. ఈ పరస్పర ఆరోపణలు యుద్ధ తీవ్రతను మరింత పెంచుతున్నాయి.

ఇది కేవలం అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం మాత్రమే కాదు. ఇజ్రాయెల్, గల్ప్, రష్యా, చైనా వంటి దేశాల ప్రయోజనాలు కూడా ఇందులో ముడిపడి ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో కీలక మార్గం.

అక్కడ పరిస్థితులు మరింత దిగజారితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు, ద్రవ్యోల్బణం పెరగడం వంటి చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మరోవైపు ఇరాన్ యుద్ధం అనే పదాన్ని అధికారికంగా ఉపయోగించడం..

అమెరికా తన సైనిక చర్యలను విస్తరించడం.. ఈ రెండూ కలిసి చూస్తే, దౌత్య చర్చల కంటే యుద్దానికే ప్రాధాన్యం పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘర్షణ రెండు దేశాలకే పరిమితమవుతుందా? లేక ప్రపంచాన్ని మరో భారీ యుద్ధ సంక్షోభం వైపు నడిపిస్తుందా? అనే ప్రశ్న ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది.

#US-Iran War#major twist#Hormuz#Israel#Gulf#Russia#China
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి