Spirituality

Spirituality: కలలు నిజమవుతాయా?.. శాస్త్రం చెప్పేది ఇదే!..

రచన: Venu5 నిమిషాల పఠనం

జీవితంలో ఊహించనవన్ని నిజం అవ్వాలనే రూల్ ఏం లేదు.. కాని ఊహించిన ప్రతి ఊహను, కలలుగా కంటూ విహరించవచ్చూ. అయితే కల అనేది వాస్తవం కన్నా ఎంతో అందంగా ఉంటుంది. అయితే భారతీయ పురాణాలు, స్వప్న శాస్త్రం వంటి సంప్రదాయ గ్రంథాల్లో కొన్ని కలలకు శుభాశుభ సంకేతాలుగా అర్థాలు చెప్పబడినాయి.

జీవితంలో ఊహించనవన్ని నిజం అవ్వాలనే రూల్ ఏం లేదు.. కాని ఊహించిన ప్రతి ఊహను, కలలుగా కంటూ విహరించవచ్చూ. అయితే కల అనేది వాస్తవం కన్నా ఎంతో అందంగా ఉంటుంది. కానీ అలాంటి కలలు మంచి అనుభూతిని కలిగించే కలలే కావు. ఒక్కోసారి కంగారు పుట్టించే కలలు కూడా వస్తుంటాయి.

ఇక సాధారణంగా మనం చూసిన సంఘటనలే మనకు కలల రూపంలో వస్తుంటాయి. ఇలాంటి కలల గురించి అంతగా పట్టించుకోకపోవడమే మంచిది. కానీ ఎలాంటి సంబంధం లేకుండా వచ్చే కొన్ని కలలు మాత్రం భవిష్యత్తులో జరుగనున్న కొన్ని పరిణామాలను సూచిస్తున్నట్లుగా వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.. మరోవైపు రాత్రి మనకు వచ్చే ప్రతి కలకు ఏదైనా అర్థం ఉంటుందా? కొన్ని కలలు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలకు సంకేతమా? అనే ప్రశ్నలు చాలా కాలంగా ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

భారతీయ పురాణాలు, స్వప్న శాస్త్రం వంటి సంప్రదాయ గ్రంథాల్లో కొన్ని కలలకు శుభాశుభ సంకేతాలుగా అర్థాలు చెప్పబడినాయి. ఉదాహరణకు.. కలలో పువ్వులు, పండ్లు కనిపిస్తే శుభకార్యాలు జరుగుతాయని, పాలు లేదా తేనె సేవిస్తున్నట్లు కనిపిస్తే మంచి ఫలితాలు వస్తాయని విశ్వసిస్తారు. అదే నూనె కనిపించడం, నీటిలో పడిపోవడం, గాల్లో ఎగురుతున్నట్లు కల రావడం వంటి వాటిని కొన్ని గ్రంథాలు హెచ్చరికలుగా పేర్కొంటాయి.

పాములను చంపినట్లు కల వస్తే శత్రువులపై విజయం సాధిస్తారని కూడా కొన్ని ఆధ్యాత్మిక విశ్వాసాలు చెబుతాయి. అయితే ఇవన్నీ శాస్త్రీయంగా నిరూపితమైన విషయాలు కావు. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం, కలలు ఎక్కువగా మన ఆలోచనలు, భావోద్వేగాలు, భయాలు, కోరికలు, రోజంతా ఎదురైన అనుభవాల ప్రతిబింబంగా వస్తాయి. ఒత్తిడి, ఆందోళన లేదా ఆనందం కూడా కలల రూపంలో వ్యక్తమవుతాయట.. ఇలా రక రకాలుగా వచ్చే కలల గురించిన ప్రతి విషయాన్ని మనపురాణాలలో చెప్పారు..

అందువల్ల ఒక కల వచ్చినంత మాత్రాన అది తప్పకుండా నిజమవుతుందని లేదా భవిష్యత్తును తెలుపుతుందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. స్వప్న శాస్త్రంలో చెప్పిన విషయాలు విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా వచ్చిన వ్యాఖ్యానాలుగా మాత్రమే చూడాలి.

కాబట్టి మంచి కల వచ్చిందని అతిగా ఉత్సాహపడాల్సిన అవసరం లేదు. పీడకల వచ్చిందని భయపడాల్సిన పనీ లేదు. కలలను జీవితానికి మార్గదర్శకంగా కాకుండా, మన మనసు ఎలా ఆలోచిస్తుందో తెలియజేసే ఒక ఆసక్తికరమైన అనుభవంగా చూడడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంకేతిక సమాచారం. సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలో మాత్రమే చూడాలని మనవి..

#Spirituality#Indian Puranas#dreams#come true#science
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి