National

High-beam lights : హై బీమ్ లైట్లతో హైటెన్షన్.. రవాణా శాఖ ఎప్పుడు మేల్కొంటుంది!?..

రచన: Venu5 నిమిషాల పఠనం

ఈ మధ్య కాలంలో రాత్రి సమయంలో జరుగుతున్న ప్రమాదాలు ప్రాణాంతకంగా మారాయి. ముఖ్యంగా టూవీలర్లు, కార్లు, ఎస్‌యూవీల్లో అధిక ప్రకాశం కలిగిన LED, HID లేదా నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన హెడ్‌లైట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో రాత్రి సమయంలో జరుగుతున్న ప్రమాదాలు ప్రాణాంతకంగా మారాయి. ముఖ్యంగా టెక్నాలజీ పెరగడం వల్ల వాహనాల హెడ్ లైట్ల విషయంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో రాత్రి వేళ వాహనం నడుపుతున్నప్పుడు... ఎదురుగా వచ్చే వాహనం యొక్క లైట్ చాలు ప్రాణాలు రిస్క్ లో పడటానికి.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాహనదారులు ఎదుర్కొంటున్న అతిపెద్ద రోడ్డు భద్రత సమస్యల్లో ఇది కూడా ఒకటని తేలింది.

ముఖ్యంగా టూవీలర్లు, కార్లు, ఎస్‌యూవీల్లో అధిక ప్రకాశం కలిగిన LED, HID లేదా నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన హెడ్‌లైట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సమస్య కేవలం లైట్లు ఎక్కువ వెలుతురు ఇవ్వడమే కాదు.. వాటిని సరైన కోణంలో సెట్ చేయకపోవడం, అవసరం లేకపోయినా ఎప్పుడూ హై బీమ్ ఉపయోగించడం ఎదురుగా వచ్చే వారికి సమస్యగా మారుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

దీని వల్ల ఎదురుగా వచ్చే డ్రైవర్ కళ్లకు గ్లేర్ ఏర్పడి, కొన్ని క్షణాల పాటు రోడ్డు స్పష్టంగా కనిపించదు. ఆ సమయంలో పాదచారులు, ద్విచక్ర వాహనాలు, గుంతలు లేదా స్పీడ్ బ్రేకర్లు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం పెరుగుతుంది. వర్షాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఇది కేవలం వ్యక్తిగత ఇబ్బంది కాదు... ప్రజా భద్రతకు సంబంధించిన సమస్య. అందుకే ప్రభుత్వం, రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు ఈ అంశాన్ని మరింత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

ఇక ప్రజాభిప్రాయం ప్రకారం.. వాహనాలకు అమర్చే హెడ్‌లైట్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి. నిబంధనలకు విరుద్ధంగా అత్యంత ప్రకాశవంతమైన లైట్లు అమర్చిన వారిపై జరిమానాలు విధించాలనే టాక్ వినిపిస్తుంది.. అలాగే ఫిట్‌నెస్ పరీక్షల్లో హెడ్‌లైట్ అలైన్‌మెంట్, కూడా తప్పనిసరిగా పరిశీలించాలని..ఆటోమొబైల్ షాపులు, యాక్సెసరీ సెంటర్లలో అనుమతి లేని లైట్ల విక్రయాన్ని సైతం కట్టడి చేయాలని అంటున్నారు. ఈ విషయంలో రవాణా శాఖ ఎప్పుడు మేల్కొంటుందని ప్రశ్నిస్తున్నారు..

అంతేకాదు... వాహన దారులు హై బీమ్‌ను ఎప్పుడు వాడాలి? లో బీమ్‌ను ఎప్పుడు ఉపయోగించాలి? అనే విషయంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. డ్రైవింగ్ లైసెన్స్ శిక్షణలో కూడా ఈ అంశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే బాధ్యత ప్రభుత్వానిదే కాదు.. ప్రతి వాహనదారుడిదీ. మనకు దారి కనిపించడం ఎంత ముఖ్యమో... ఎదురుగా వచ్చే వ్యక్తికి కూడా సురక్షితంగా తోవ కనిపించడం అంతే ముఖ్యమని వాహన చోదకులు గుర్తించాలి..

ఇందుకోసం అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి.. వాహనదారులు నిబంధనలు పాటించాలి... అప్పుడే రాత్రి ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుంది. రోడ్డు భద్రత అనేది చట్టాలతో మాత్రమే కాదు... ప్రతి ఒక్కరి బాధ్యతతోనే సాధ్యమవుతుందని అధికారులు తెలియజేస్తున్నారు.

#High-beam lights#Night time#driving#Road Accidents#high tension#Transport Department
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి