Health

Health: చర్మానికి నిమ్మ తొక్క మంచిదేనా?.. నిపుణులు చెప్పేది ఏటంటే!..

రచన: Venu4 నిమిషాల పఠనం

నిమ్మరసం తీసిన తర్వాత మిగిలిన నిమ్మ తొక్కను చాలా మంది పారేస్తారు. కానీ అది చర్మ సంరక్షణలో ఉపయోగపడుతుందనే ప్రచారం తరచూ వినిపిస్తుంది. మరి ఇందులో ఉన్న నిజం ఎంత?

అందంగా మెరిసిపోవాలని ఎవరికి మాత్రం ఉండదు.. అందుకే బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరిగే వారి సంఖ్య పెరుగుతుంది. అయితే చర్మం మెరవడంలో విటమిన్ C పాత్ర మరవలేనిదని అంటున్నారు.

ఇక నిపుణుల ప్రకారం, నిమ్మ తొక్కలో విటమిన్-సీ, సిట్రిక్ యాసిడ్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించడంలో కొంతవరకు సహాయపడవచ్చు. చక్కెరతో కలిపి మెల్లగా రుద్దితే అది సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌లా పనిచేస్తుంది. అయితే నల్లటి మోచేతులు, మోకాళ్లు లేదా పాదాల రంగు పూర్తిగా మారిపోతుందని చెప్పడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు.

అలాగే బేకింగ్ సోడా చర్మాన్ని శుభ్రపరుస్తుందని కొందరు చెబుతున్నా, చర్మ వైద్యులు దీనిని తరచుగా ఉపయోగించాలని సిఫార్సు చేయరు. ఎందుకంటే బేకింగ్ సోడా చర్మం యొక్క సహజ రక్షణ పొరను దెబ్బతీసి పొడిబారడం, మంట లేదా చికాకు కలిగించే అవకాశం ఉంది.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ కొందరిలో చర్మానికి మంట, ఎర్రబారడం లేదా అలెర్జీని కలిగించవచ్చు. నిమ్మరసం లేదా నిమ్మ తొక్క ఉపయోగించిన వెంటనే ఎండలోకి వెళితే కొందరికి ఫైటోఫోటోడెర్మటైటిస్ అనే చర్మ సమస్య వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.

అందుకే ఈ గృహ చిట్కాను ప్రయత్నించాలనుకుంటే.. ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయండి. గాయాలు, కోతలు లేదా సున్నితమైన చర్మంపై దీనిని ఉపయోగించవద్దు. గట్టిగా రుద్దడం కూడా మంచిది కాదు.

మొత్తానికి నిమ్మ తొక్కతో చర్మం కొంత శుభ్రంగా, మృదువుగా అనిపించవచ్చు. కానీ నల్లటి మచ్చలు పూర్తిగా పోతాయని లేదా చర్మం తెల్లగా మారుతుందని చెప్పడం శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. చర్మ సమస్యలు ఎక్కువకాలం ఉంటే ఇంటి చిట్కాల కంటే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..

#Health#lemon peel#good skin#Vitamin C#Citric acid
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి