Health

Health: మాడిన చపాతీతో క్యాన్సర్ వస్తుందా?.. డాక్టర్లు ఏం చెప్పారంటే!..

రచన: Venu5 నిమిషాల పఠనం

గ్యాస్ మంటపై కాల్చిన చపాతీ తింటే క్యాన్సర్ వస్తుందా? ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తతో చాలామంది ఆందోళన చెందుతున్నారు. కానీ ఇందులో ఎంత నిజం ఉందో తెలుసుకుందాం!.

గ్యాస్ మంటపై కాల్చిన చపాతీ తింటే క్యాన్సర్ వస్తుందా? ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తతో చాలామంది ఆందోళన చెందుతున్నారు. కానీ ఇందులో ఎంత నిజం ఉందో తెలుసుకుందాం!.

వైద్య నిపుణులు, క్యాన్సర్ పరిశోధనా సంస్థల వివరాల ప్రకారం.. చపాతీలు, రొట్టెలు, బంగాళాదుంపలు వంటి పిండి పదార్థాలు అధిక ఉష్ణోగ్రత వద్ద బాగా మాడినప్పుడు అక్రిలామైడ్, అలాగే మాంసాహారాన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చినప్పుడు హెటెరోసైక్లిక్ అమైన్‌లు, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు వంటి కొన్ని రసాయనాలు ఏర్పడవచ్చు.

జంతువులపై నిర్వహించిన కొన్ని ప్రయోగాల్లో ఈ రసాయనాలు అధిక మోతాదులో ఎక్కువకాలం శరీరంలోకి వెళితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని గుర్తించారు. అయితే.. ఇదే ప్రభావం సాధారణ ఆహారం తీసుకునే మనుషుల్లో ఉంటుందని నిరూపించే బలమైన శాస్త్రీయ ఆధారాలు ప్రస్తుతం లేవు.

అంటే... ఒకటి లేదా రెండు సార్లు పొరపాటున మాడిన చపాతీ తింటే క్యాన్సర్ వస్తుందనే ప్రచారం నిజం కాదు. క్యాన్సర్ అనేది ఒక్క ఆహారం వల్ల ఒక్కరోజులో వచ్చే వ్యాధి కాదు. వంశపారంపర్య లక్షణాలు, ధూమపానం, మద్యం సేవించడం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, కొన్ని వైరస్‌లు, పర్యావరణ కాలుష్యం వంటి అనేక అంశాలు కలిసి క్యాన్సర్ ప్రమాదాన్ని ప్రభావితం చేస్తాయి.

అయితే.. అందుకే మాడిన ఆహారాన్ని తరచుగా తినడం మంచిదని కూడా చెప్పలేం. సాధ్యమైనంత వరకు చపాతీలను లైట్ గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు మాత్రమే కాల్చడం మంచిది. పూర్తిగా నల్లగా మాడిన భాగాలు ఉంటే వాటిని తీసివేసి మిగిలిన భాగాన్ని తినవచ్చు.

గ్యాస్ మంటపై నేరుగా కాల్చడం తప్పనిసరిగా ప్రమాదకరం అని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ, పెనం మీద సమంగా కాల్చడం వల్ల ఆహారం అధికంగా మాడిపోకుండా ఉంటుంది. అలాగే రోజువారీ ఆహారంలో పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అయితే అవి టాక్సిన్స్‌ను పూర్తిగా తొలగిస్తాయి అనే వాదనకు బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. మొత్తానికి మాడిన చపాతీ ఒక్కసారి తిన్నంత మాత్రాన క్యాన్సర్ వస్తుందనే సోషల్ మీడియా ప్రచారం తప్పుదారి పట్టించేదే. కానీ ఏ ఆహారాన్నైనా అతిగా మాడకుండా వండడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, ధూమపానం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం... ఇవే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ముఖ్యమైన అలవాట్లని హెల్త్ ప్రొఫెషన్స్ అంటున్నారు..

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..

#Health#burn chapati#cause cancer#doctors#Gas flame
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి