Spirituality

Spirituality: భారత దేశంలో కదిలే శివలింగం ఎక్కడుంది? నిజంగానే కదులుతుందా?..

రచన: Venu4 నిమిషాల పఠనం

భారతదేశంలో ఎన్నో పురాతన శివాలయాలు ఉన్నాయి. కానీ వాటిలో ఒక ఆలయం మాత్రం ఒక అద్భుతమైన విశేషంతో భక్తులను ఆశ్చర్యపరుస్తోంది. అదే... కదిలే శివలింగం.. రాయితో చేసిన శివలింగం ఎలా కదులుతుంది? అనే ప్రశ్న చాలామందిలో ఆసక్తిని కలిగిస్తుంది.

భారతదేశంలో ఎన్నో పురాతన శివాలయాలు ఉన్నాయి. కానీ వాటిలో ఒక ఆలయం మాత్రం ఒక అద్భుతమైన విశేషంతో భక్తులను ఆశ్చర్యపరుస్తోంది. అదే... కదిలే శివలింగం.. రాయితో చేసిన శివలింగం ఎలా కదులుతుంది? అనే ప్రశ్న చాలామందిలో ఆసక్తిని కలిగిస్తుంది.

ఛత్తీస్‌గఢ్‌లోని గిరౌద్‌పురి సమీపంలో ఉన్న భూతేశ్వర్‌నాథ్ మహాదేవాలయం ఈ విశేషానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న శివలింగం ప్రపంచంలోనే అతిపెద్ద సహజ శివలింగాలలో ఒకటిగా భావిస్తారు. స్థానికుల విశ్వాసం ప్రకారం ఈ శివలింగం ప్రతి సంవత్సరం కొద్దికొద్దిగా ఎత్తు, వెడల్పు పెరుగుతూనే ఉంటుందని చెబుతారు. అందుకే దీనిని చాలామంది.. కదిలే.. లేదా పెరుగుతున్న శివలింగంగా పిలుస్తుంటారుట.

ఈ మహిమాన్విత శివలింగాన్ని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ భారీ సంఖ్యలో భక్తులు పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన ఎన్నో స్థానిక కథలు, విశ్వాసాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే శివలింగం కదలడం లేదా పెరగడం గురించి శాస్త్రీయంగా నిర్ధారిత ఆధారాలు తక్కువ ఉన్నాయి. అందువల్ల దీనిని ప్రధానంగా భక్తుల విశ్వాసంగా చూడాలి.

భక్తులకు మాత్రం ఇది కేవలం ఒక రాతి శిల కాదు... పరమశివుడి సాక్షాత్కారంగా భావించే పవిత్ర స్థలం. అందుకే ఈ ఆలయాన్ని సందర్శించిన వారు శివుని అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. మరోవైపు యాగంటితో పాటు మరికొన్ని ఆలయాల్లో కూడా శివలింగాలు కదులుతున్నట్లు లేదా పెరుగుతున్నట్లు వార్తలు వస్తుంటాయి.. కాగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యాగంటి నందితో పాటు, ఛత్తీస్‌గఢ్‌లోని ఈ భూతేశ్వర్‌నాథ్ శివలింగం ప్రకృతి మాయాజాలానికి, భక్తుల విశ్వాసానికి కొలమానంగా నిలుస్తున్నాయి!

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంకేతిక సమాచారం. సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలని మనవి..

#Chhattisgarh#Bhuteshwarnath Mahadev#Giroudpuri#Temple#Shivalingam
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి