క్రైమ్

Abishek Porel: ఐపీఎల్ క్రికెటర్‌కు హైకోర్టు బిగ్ షాక్.. వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలు

రచన: NK5 నిమిషాల పఠనం

అత్యాచారం కేసులో ఐపీఎల్ క్రికెటర్ కు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ చిక్కుల్లో పడ్డాడు. రేప్ కేసులో పోరెల్ ను వెంటనే అరెస్ట్ చేయాలని కలకతా హైకోర్టు ఆదేశించింది. అత్యాచారం, నేరపూరిత బెదిరింపులు, ఇతర తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఒక వైద్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన క్రిమినల్ కేసులో క్రికెటర్ అభిషేక్ పోరెల్, మరో నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది.

Abishek Porel: అత్యాచారం కేసులో ఐపీఎల్ క్రికెటర్ కు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ చిక్కుల్లో పడ్డాడు. రేప్ కేసులో పోరెల్ ను వెంటనే అరెస్ట్ చేయాలని కలకతా హైకోర్టు ఆదేశించింది. అత్యాచారం, నేరపూరిత బెదిరింపులు, ఇతర తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఒక వైద్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన క్రిమినల్ కేసులో క్రికెటర్ అభిషేక్ పోరెల్, మరో నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. అలాగే బాధితురాలి ప్రైవసీని కాపాడేందుకు పోరెల్ ఎలక్ట్రానిక్ డివైజ్ లను కూడా సీజ్ చేయాలని చెప్పింది.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను లైంగికంగా లొంగదీసుకున్నాడని, ఆ తర్వాత తనపై దాడి చేసి నేరపూరిత బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ యువతి బెంగాల్, ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్-బ్యాటర్ అభిషేక్ పోరెల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కాగా, తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ తీవ్రంగా ఖండించాడు పోరెల్. మంగళవారం హూగ్లీ జిల్లాలోని మోగ్రా పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు, ఆమె తల్లి ఫిర్యాదుతో పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు.

పోరెల్, తాను మూడేళ్లుగా ప్రేమలో ఉన్నామని బాధితురాలు తెలిపింది. గత ఏడాది తమ మధ్య విభేదాలు తలెత్తాయని, ఆ తర్వాత పోరెల్ తనకు దూరంగా ఉండటం ప్రారంభించాడని ఆమె తెలిపింది. పోరెల్ తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని, కానీ ఇప్పుడు అందుకు నిరాకరిస్తున్నాడని వాపోయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని.. ఇప్పుడేమో తనపై దాడి చేసి, నేరపూరితమైన రీతిలో బెదిరించాడని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది.

ప్రస్తుతం బెంగళూరులో ఉన్న పోరెల్, తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. యువతి చేసిన ఆరోపణలు అవాస్తవమన్నాడు. పోలీసులు తనను ఇంకా సంప్రదించలేదని కూడా చెప్పాడు. "నేను ప్రస్తుతం బాగా ఆడుతున్నా, అందుకే రకరకాల వార్తలు వస్తున్నాయి. పోలీసుల ప్రాథమిక విచారణ తర్వాత దీనిపై వివరంగా స్పందిస్తానని 23 ఏళ్ల ఈ ఆటగాడు తెలిపాడు.

ఎడమచేతి వాటం కలిగిన టాప్-ఆర్డర్ బ్యాటర్ పోరెల్ 2023 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున నాలుగు ఇన్నింగ్స్‌లలో 108 పరుగులు చేశారు. 2021-22 సీజన్‌లో బెంగాల్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసిన పోరెల్, ఇప్పటివరకు 32 ఫస్ట్-క్లాస్, 23 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడాడు.

#Abishek Porel#Arrest#Calcutta High Court#Assault#IPL#Delhi Capitals
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి