National

Ayodhya: విరాళాల చోరీ పై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు!!..

రచన: Venu3 నిమిషాల పఠనం

ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య రామాలయంలో చోటు చేసుకున్న విరాళాల చోరీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే తాజాగా ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య రామాలయంలో చోటు చేసుకున్న విరాళాల చోరీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నదనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు పై ఫోకస్ చేసింది. అదే సమయంలో రామాలయ ట్రస్టు ఛైర్మన్ చంపత్ రాయ్ తో పాటు మరికొందరు సభ్యులు రాజీనామాలు సమర్పించడంపై పలు అనుమానాలు చోటు చేసుకున్నాయి..

అయితే తాజాగా ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసు సాధారణమైన నేరమే. ఈ కేసును రాజకీయం చేయొద్దంటూ సూచించింది. కాగా జస్టిస్ సూర్యకాంత్, జోయ్‌మల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా అయోధ్య రామమందిరం కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. అందుకే ఈ ఆలయానికి సంబంధించిన ఏ అంశమైనా సహజంగానే దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. కానీ... అలాంటి సందర్భాల్లో కూడా న్యాయవ్యవస్థ రాజకీయాలకు అతీతంగా, నిష్పాక్షికంగా వ్యవహరిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఇక ఈ కేసును సీబీఐకి అప్పజెప్పాలని దాఖలైన పిటిషన్లను నేడు (సోమవారం) సుప్రీంకోర్టు విచారించింది. ఈ అంశంపై వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. మరోవైపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసును దర్యాప్తు చేస్తోంది.

#India#Ayodhya Ram temple#Donation#Supreme Court#Political Issue
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి