Film News: టాలీవుడ్‌లో ‘మెగా’ ట్యాగ్ ఉందంటే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురవడం ఖాయం. దశాబ్దాలుగా ఈ కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలు రికార్డులను తిరగరాస్తూనే ఉన్నారు. కానీ, ఇప్పటివరకు ఆ స్టార్ హీరోలకు సైతం సాధ్యం కాని ఒక అరుదైన గౌరవాన్ని, సరికొత్త రికార్డును మెగా డాటర్ నిహారిక కొణిదెల తన ఖాతాలో వేసుకున్నారు. నటిగా ఆశించిన స్థాయిలో సక్సెస్ రాకపోయినా.. ప్రొడ్యూసర్‌గా మారిన మొదటి ప్రయత్నంలోనే ఆమె ఏకంగా జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుని ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచారు.
సొంతంగా 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్‌ను స్థాపించిన నిహారిక, కమర్షియల్ ఫార్ములా సినిమాల జోలికి వెళ్లలేదు. మెగా ఫ్యామిలీ ఇమేజ్‌ను వాడుకుని పెద్ద బడ్జెట్ సినిమాలు తీసే అవకాశం ఉన్నా.. కేవలం కథను నమ్మి ‘కమిటీ కుర్రోళ్ళు’ అనే చిన్న చిత్రాన్ని నిర్మించారు. స్టార్ కాస్ట్ లేకపోయినా, పల్లెటూరి నేపథ్యంలో సాగే బలమైన కంటెంట్‌తో ఆమె చేసిన ఈ ప్రయోగం థియేటర్లలో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, తాజాగా ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 'బెస్ట్ తెలుగు ఫిల్మ్' కేటగిరీలో ప్రాంతీయ అవార్డును కైవసం చేసుకుంది.
టాలీవుడ్ హిస్టరీలోనే ఒక మహిళా ప్రొడ్యూసర్‌గా, అదీ మెగా కాంపౌండ్ నుంచి ఒక చిన్న కథతో నేషనల్ అవార్డ్ అందుకోవడం ఇదే మొదటిసారి. కెరీర్ పరంగా, పర్సనల్‌గా ఎదురైన ఒడిదొడుకులను లెక్కచేయకుండా, సైలెంట్‌గా ప్రొడక్షన్ వైపు అడుగులు వేసి నిహారిక సాధించిన ఈ విజయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రేర్ రికార్డ్‌తో మెగా కాంపౌండ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన నిహారిక ప్రొడక్షన్ హౌస్ వాల్యూ ఒక్కసారిగా పెరిగిపోయింది. భవిష్యత్తులో మరిన్ని వినూత్నమైన చిత్రాలను నిర్మించడానికి ఈ సాలిడ్ బూస్ట్ ఆమెకు ఎంతగానో హెల్ప్ అవుతుందనడంలో సందేహం లేదు.












