సినిమా

Tollywood: 3 భాష‌లు.. ముగ్గురు హీరోలు.. మమితా మ‌డ‌తెట్టేస్తుందిగా..!

రచన: Anshu5 నిమిషాల పఠనం

Tollywood: 'ప్రేమలు' సినిమాతో కుర్రకారు గుండెల్లో రీసౌండ్ తెప్పించిన మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు.. ఇప్పుడు టోటల్ సౌత్ ఇండస్ట్రీని షేక్ చేయడానికి రెడీ అయిపోయింది. కేవలం గ్లామర్ బొమ్మలా మిగిలిపోకుండా, బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ దగ్గర దండయాత్రకు సై అంటోంది. యంగ్ జనరేషన్ హీరోయిన్లలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో, కేవలం నెల రోజుల వ్యవధిలోనే మూడు వేర్వేరు భాషల్లో, ముగ్గురు స్టార్ హీరోల సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ట్రేడ్ వర్గాల మైండ్ బ్లాక్ చేస్తోంది.

ఈ సెన్సేషనల్ జర్నీలో ఆమె మొదటి అడుగు కోలీవుడ్ సూపర్ స్టార్, దళపతి విజయ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా 'జన నాయగన్' (తెలుగులో జననాయకుడు)తో పడబోతోంది. ఎన్నో అంచనాల మధ్య జులై 23న థియేటర్లలోకి రాబోతున్న ఈ భారీ చిత్రంలో మమితా ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో మెరవనుంది. విజయ్ లాంటి మాస్ బేస్ ఉన్న హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేయడమే ఒక ఎత్తయితే, అందులో ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కించుకోవడం ఈ బ్యూటీ కెరీర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక తమిళంలో మాస్ ఎంట్రీ ఇస్తూనే, మరోవైపు టాలీవుడ్ మార్కెట్‌ను క్యాష్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న బైలింగ్వల్ మూవీ ‘విశ్వనాథ్ & సన్స్’తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెర్సటైల్ యాక్టర్ సూర్య సరసన మమితా నటిస్తుండటం విశేషం. ఆగస్ట్ 14న రిలీజ్ కానున్న ఈ సినిమాలో ఆమె లుక్స్, బబ్లీ క్యారెక్టరైజేషన్ తెలుగు, తమిళ ఆడియన్స్‌ను కచ్చితంగా కట్టిపడేస్తాయని ప్రమోషన్స్ చూస్తేనే అర్థమవుతోంది.

కోలీవుడ్, టాలీవుడ్ హడావుడి ఇలా ఉండగానే.. ఆగస్ట్ 21న తన మాతృభాష మలయాళంలో 'బెత్లహేమ్ కుడుంబ యూనిట్' సినిమాతో థియేటర్లలో సందడి చేయనుంది. మమితాకు లైఫ్ ఇచ్చిన 'ప్రేమలు' దర్శకుడు గిరీష్ ఏడీ రూపొందిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో మోలీవుడ్ స్టార్ నివిన్ పౌలీ హీరోగా నటిస్తున్నాడు. ఇలా కేవలం 30 రోజుల గ్యాప్‌లో తమిళంలో విజయ్, తెలుగులో సూర్య, మలయాళంలో నివిన్ పౌలీ లాంటి ముగ్గురు టాప్ స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది సౌత్ సినిమా హిస్టరీలోనే ఒక అరుదైన రికార్డ్. ఈ ముగ్గురు హీరోల స్పీడుకు తోడు మమితా క్రేజ్ కూడా తోడైతే, ఈ ఆగస్ట్ నాటికి ఆమె రేంజ్, రెమ్యునరేషన్ టచ్ చేయడం ఎవరి వల్లా కాదేమో.

#MamithaBaiju#jananayagan#vijay#surya
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి