తెలంగాణ

Heavy Rains : ఉపరితల ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

రచన: Kumar3 నిమిషాల పఠనం

ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైన పెద్దగా వర్షాలు కురవలేదు. వానలు లేక ఓవైపు సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెరువులు, కుంటలు, బావుల్లో నీళ్లు లేక వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సాగుకు ఉపయోగిస్తున్న దృశ్యాలు కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి.

ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైన పెద్దగా వర్షాలు కురవలేదు. వానలు లేక ఓవైపు సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెరువులు, కుంటలు, బావుల్లో నీళ్లు లేక వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సాగుకు ఉపయోగిస్తున్న దృశ్యాలు కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. విత్తనాలు మొలకెత్తి వాడిపోతుండటంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మరోవైపు ప్రాజెక్టులు సైతం డెడ్ స్టోరేజీకి చేరుకుంటున్నాయి. మరికొన్ని రోజులు ఇలాంటి పరిస్థితులే ఎదురైతే తాగు నీరు దొరకడం కూడా కష్టతరం కానుందని నిపుణులు చెబుతున్నారు.

ఇదిలాఉండగా, తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతవరణ శాఖ శుభవార్త చెప్పింది.ఏపీ, తెలంగాణలో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.నిన్న రాత్రి నుంచి రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి.ఇవాళ ఉదయం 10 గంటలకు తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్రపై ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావం ఉన్న‌ట్లు ఏపీ వాతావరణ శాఖ తెలిపింది.దీంతో నేడు శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.ఇక మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టంచేసింది.

#heavy rains#telangana#Andrapradesh#whether report
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి