రాష్ట్ర ఆదాయం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు టార్గెట్ విధించింది. రిజిస్ట్రేషన్ చార్జీలు, భూముల రేట్లు పెంచినా సర్కారు ఆదాయం మాత్రం పెరగలేదు. దీనంతటికీ వివిధ శాఖల్లో సర్కారు ఆదాయానికి కొందరు అక్రమార్కులు గండి కొడుతున్నట్టు నిఘా వర్గాలు గుర్తించి సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక అందజేసినట్టు తెలుస్తోంది. దీంతో అక్రమార్కుల భరతం పట్టాలని రేవంత్ సర్కార్ చూస్తున్నట్టు తెలుస్తోంది.
అందుకే హైడ్రా తరహా మరో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను ఏర్పాటు చేసి అవినీతిని అంతం చేయాలని, కరప్షన్ చేస్తున్నవారిని, సర్కారుకు రెవెన్యూ రాకుండా దోచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని సమాచారం.ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆదాయంలో లీకేజీలను అరికట్టేందుకు కొత్త సంస్థ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెరగకపోవడంతో, ప్రభుత్వ ఆదాయానికి పలువురు అక్రమార్కులు గండి కొడుతున్నారని ఇప్పటికే రిపోర్టులు సర్కార్ వద్ద ఉన్నట్టు తెలిసింది.
https://x.com/TeluguScribe/status/2079423801847415184?s=20
అందుకే హైడ్రా తరహాలో మరో సంస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వారిపై కఠినచర్యలు తీసుకునే విధంగా ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డికి అధికారులు సూచించినట్టు తెలిసింది.ముఖ్యంగా వాణిజ్య పన్నులు, గనులు, పౌర సరఫరాలు, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల్లో అవినీతి జరగకుండా అన్ని శాఖలకు ఒకే నిఘా విభాగం ఉండాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించినట్టు సమాచారం. అయితే, ఈ నిర్ణయంతో అన్ని శాఖలపై మంత్రులు పట్టు కోల్పోతారని, నేరుగా రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే అన్ని శాఖలు పనిచేసే పరిస్థితి ఏర్పడుతుందని నిపుణుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి.












