ఏపీ

CoronaVirus : విజృంభిస్తున్న కరోనా వైరస్.. 19కి పెరిగిన కేసులు!

రచన: Kumar3 నిమిషాల పఠనం

ప్రపంచాన్ని వణికించిన కరోనా ఐదేండ్ల తర్వాత మరోసారి కోరలు చాస్తోంది. 2020లో వెలుగుచూసిన ఆ తర్వాత రెండేండ్ల పాటు మరణఘోష వినిపించింది. ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున లక్షల్లో మరణాలు సంభవించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీని విధించింది.

ప్రపంచాన్ని వణికించిన కరోనా ఐదేండ్ల తర్వాత మరోసారి కోరలు చాస్తోంది. 2020లో వెలుగుచూసిన ఆ తర్వాత రెండేండ్ల పాటు మరణఘోష వినిపించింది. ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున లక్షల్లో మరణాలు సంభవించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీని విధించింది. ఇండియాలో కొవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. లక్షణాలు ఉన్నవారికి క్వారంటైన్ చేసి చికిత్స అందించారు. దేశవిదేశాలకు కొవిడ్ వ్యాక్సిన్లు సప్లయ్ చేసిన ఇండియా.. ఎంతో మంది ప్రాణాలు కాపాడటంలో కీలక పాత్ర పోషించింది.

ఇంతకాలం సెలెంట్‌గా ఉన్న కొవిడ్ కేసులో తాజాగా ఏపీలో మళ్లీ విజృంభిస్తున్నాయి. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 19 వరకు కేసులు నమోదయ్యాయి.అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి.గుంటూరు, కాకినాడ జిల్లాల్లో రెండేసి, విశాఖ, ఏలూరు, నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

తాజాగా నమోదైన కేసుల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌ను గుర్తించినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఒమిక్రాన్ RF 5 వేరియంట్‌ లక్షణాలు..కరోనా ఒమిక్రాన్ RF 5 వేరియంట్‌ లక్షణాలు సాధరణంగానే ఉంటాయని.. పెద్దగా ప్రమాదం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, అలసట RF 5 లక్షణాలుగా వెల్లడించారు. సింగపూర్‌తో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో RF 5 కేసులు వెలుగు చూస్తున్నాయని.. RF 5 వేరియంట్‌పై ఆందోళన అవసరం లేదని ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా సోకిన వారితో ఎవరైతే కాంటాక్ట్ అయ్యారో వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు. లక్షణాలు ఉన్న వారు సెల్ఫ్ క్వారంటైన్ అవ్వాలని సూచిస్తున్నారు. ముందుగా టెస్టులు చేయించుకోవాలని కోరారు.

#Corona virus#Omicran R5 veriant#Andrapradesh#quarantine
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి