వ్యాపారం

GOLD : మళ్లీ కొండెక్కిన బంగారం, వెండి ధరలు

రచన: Kumar3 నిమిషాల పఠనం

బంగారం, వెండి ధరలు మళ్లీ కొండెక్కాయి. సామాన్యులతో దోబూచులాడుతున్నాయి. ఒకసారి పెరగడం, తగ్గడం చేస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో ఆషాఢమాసం సేల్ నడుస్తున్నది. అయినప్పటికీ బంగారం ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు కొనుగోలు చేసేందుకు వెనకాముందు ఆడుతున్నారు.

బంగారం, వెండి ధరలు మళ్లీ కొండెక్కాయి. సామాన్యులతో దోబూచులాడుతున్నాయి. ఒకసారి పెరగడం, తగ్గడం చేస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో ఆషాఢమాసం సేల్ నడుస్తున్నది. అయినప్పటికీ బంగారం ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు కొనుగోలు చేసేందుకు వెనకాముందు ఆడుతున్నారు. బంగారం ధరలు స్థిరంగా ఉంటే వారు ఆసక్తి చూపిస్తారని వ్యాపారులు అంటున్నారు. ఒక రోజు తగ్గితే మరింత తగ్గుతుంందేమో అని ఎదురుచూస్తుంటారని.. మరల పెరిగే సరికి ఇంకా పెరుగుతుందేమో అని భయపడి కొనుగోలు చేయడం లేదని కూడా వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా మదుపరులు మరోసారి బంగారం, వెండి మీద పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని.. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరుగుతోందని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు.ఇరాన్ -అమెరికా మధ్య యుద్ధం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.క్రూడ్ ధరలు పతనం అవుతుండటం కూడా పెట్టుబడి దారులు బంగారం, వెండిపై ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే బంగారం ధరలు పెరుగుతున్నాయని సమాచారం. అందుకే బంగారంతో పాటే వెండి కూడా ధరల పెరుగుదలతో పోటీ పడుతున్నట్టు తెలిసింది.మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.760 పెరిగి రూ.1,44,220కి చేరుకోగా..22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.1,32,200కి చేరుకుంది. బంగారం మాదిరిగానే వెండి ధర పెరగగా.. కిలో వెండిపై రూ.5000 పెరిగింది.ప్రస్తుత ధర రూ.2,40,000గా ఉన్నది. పెరిగిన ధరలపై జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు అదనంగా విధించనున్నారు.

#Gold#silver#rates#hike#bullion market
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి