ప్రస్తుతం దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ అంశం తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. లీకేజీ కారణంగా కొందరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్డడ్డారు. దీంతో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చలో పార్లమెంట్‌కు పిలుపునిచ్చింది.దీనికి ప్రముఖ సామాజిక వేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ కూడా మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. నిన్న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజే.. సీజేపీ చేపట్టిన చలో పార్లమెంట్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు లాఠీచార్జ్ చేశారు.టియర్ గ్యాస్ ప్రయోగించారు. కేంద్రమంత్రి జేపీ నడ్డా సీజీపీ లీడర్లతో భేటీ అయి వారి డిమాండ్లు విన్నారు. తమ మూడు డిమాండ్లు నెరవేరే వరకు నిరసనలుు కొనసాగుతాయని సీజేపీ ప్రకటించింది.
ఈ క్రమంలోనే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా నేటి ఉదయం ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని 'నీట్' పేపర్ లీకేజీ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ప్రయోజనాలే తమకు మొదటి ప్రాధాన్యమని వివరించారు. వారికి ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం త్వరితగతిన పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేసిందన్నారు.పేపర్ లీకేజీలకు పాల్పడటం తీవ్రమైన నేరమని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకున్న వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కేసులో దోషులకు దేశంలోనే అత్యుత్తమ న్యాయవాదుల ద్వారా కఠినమైన శిక్ష పడేలా చేస్తామని ప్రకటించారు. భవిష్యత్‌లో ఎవరూ మళ్లీ ఇలాంటి లీకేజీలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.రాబోయే రోజుల్లో పరీక్షా పత్రాలు లీక్ కాకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.












