Aishwarya Rajesh: నందమూరి బాలకృష్ణ మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన స్క్రీన్‌పై కనిపిస్తే చాలు థియేటర్లలో పూనకాలు రావాల్సిందే. అలాంటి బాలయ్యను ఢీకొట్టే విలన్ల ఎంపిక ఎప్పుడూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారుతుంది. అయితే, తాజాగా టాలీవుడ్‌లో ఒక క్రేజీ రూమర్ గట్టిగా వినిపిస్తోంది. నందమూరి నటసింహం నెక్స్ట్ సినిమాలో ఒక పవర్‌ఫుల్ లేడీ విలన్ పాత్ర ఉండబోతోందని, ఆ క్యారెక్టర్ కోసం తెలుగు మూలాలున్న టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్‌ను ఎంపిక చేసినట్లు టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆ తెలుగమ్మాయి మరెవరో కాదు ఐశ్వర్య రాజేష్.
సాధారణంగా గ్లామర్ రోల్స్, హోమ్లీ క్యారెక్టర్లతో మెప్పించే ఐశ్వర్య రాజేష్.. ఈసారి రూట్ మార్చి ఏకంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో బాలయ్యతో ఢీకొట్టడానికి రెడీ అవుతున్నట్లు ఫిలిం నగర్ వర్గాలు కోడై కూస్తున్నాయి. కేవలం పేరుకే విలన్ కాకుండా, కథను మలుపు తిప్పే అత్యంత కీలకమైన, బలమైన సంఘర్షణతో కూడిన పాత్ర ఇదని సమాచారం. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ పాత్రతో సమానంగా ఈ లేడీ విలన్ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారట. అసలు బాలయ్య లాంటి మాస్ హీరోను ఐశ్వర్య రాజేష్ స్క్రీన్‌పై ఎలా ఎదిరించబోతోంది? అనే ఉత్కంఠ ఇప్పుడు నందమూరి అభిమానుల్లో పెరిగిపోతోంది.
ఇక ఈ సినిమా వివరాల్లోకి వెళ్తే.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం NBK112 వర్కింగ్ టైటిల్స్ తో అమరావతిలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నందమూరి బాలకృష్ణ మాస్ ఇమేజ్‌కు సరిగ్గా సరిపోయేలా, ఒక సరికొత్త సోషల్-యాక్షన్ కథాంశంతో ఈ సినిమాను పాన్-ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలయ్య కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ వ్యయంతో, దాదాపు రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు బడ్జెట్‌తో తెరకెక్కుతుండటం విశేషం.












