Uday Krishna Reddy: లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఉదయ్ పోలీస్ కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ఆయనను రెండు రోజుల పాటు విచారణ చేసేందుకు ఉప్పరపల్లి కోర్టు ఓకే చెప్పింది. లైంగిక వేధింపుల కేసులో మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున ఉదయ్ ని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. అందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు ఉదయ్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఉదయ్ ను ఉమెన్ సేఫ్టీ వింగ్ కస్టడీలోకి తీసుకోనుంది. ప్రస్తుతం ఉదయ్ చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్నాడు.
ఫోన్ ఎక్కడ దాచాడు?
లైంగిక వేధింపుల కేసు విచారణలో మరో మహిళను సైతం ఉదయ్ వేధించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అతడిని లోతుగా విచారించి మరిన్ని వివరాలు రాబట్టాలని పోలీసులు నిర్ణయించారు. ఇందుకోసం కస్టడీకి ఇవ్వాలని కోరారు. పోలీస్ కస్టడీలో అనేక అంశాలపై ఉదయ్ ని ప్రశ్నించనున్నారు. ప్రధానంగా ఉదయ్ సెల్ ఫోన్ కనిపించకుండా పోయింది. దానిపై పోలీసులు దృష్టి సారించారు. సెల్ ఫోన్ ని ఏం చేశాడు, ఎక్కడ ఉంచాడు, అందులో ఏమున్నాయి, అసలు ఫోన్ ను ఎందుకు రహస్యంగా దాచాడు.. ఇలా అన్ని కోణాల్లో లోతుగా ఉదయ్ ని పోలీసులు విచారించనున్నారు. రేపు ఉదయ్ ని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు.
చాలామంది అమ్మాయిలతో..
కాగా.. తనను లైంగికంగా వేధించాడని, బ్లాక్ మెయిల్ చేశాడని, దాడి కూడా చేశాడని తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్.. ఉదయ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఉదయ్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ జరుగుతున్న కొద్దీ అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా ఉదయ్ ఫోన్ కీలకంగా మారింది. గుట్టంతా ఆ ఫోన్ లోనే ఉన్నట్లు సమాచారం. ఆ ఫోన్ దొరికితే మరిన్ని కీలక విషయాలు బయటపడతాని పోలీసులు భావిస్తున్నారు.












