తెలంగాణ

Uttam Vs Harish: తప్పుడు ప్రచారం మానుకోండి, బట్ట కాల్చి మీద వేయడమే మీ పని- హరీశ్ పై మంత్రి ఉత్తమ్ ఫైర్

రచన: NK12 నిమిషాల పఠనం

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావుపై నిప్పులు చెరిగారు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీటి వాటాల విషయంలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం మానుకోవాలని హరీశ్ కి హితవు పలికారు. కట్టు కథలతో బట్ట కాల్చి మీద వేయద్దన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదన్నారు. GRMB అజెండాలో కొత్త అంశాలు ఏమీ లేవన్నారు. 12 ఏళ్లుగా ఏపీ అవే అభ్యంతరాలు చెబుతోందన్నారు. సీతారామ ప్రాజెక్టుకు టీఏసీ అనుమతి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని గుర్తు చేశారు.

Uttam Vs Harish: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావుపై నిప్పులు చెరిగారు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీటి వాటాల విషయంలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం మానుకోవాలని హరీశ్ కి హితవు పలికారు. కట్టు కథలతో బట్ట కాల్చి మీద వేయద్దన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదన్నారు. GRMB అజెండాలో కొత్త అంశాలు ఏమీ లేవన్నారు. 12 ఏళ్లుగా ఏపీ అవే అభ్యంతరాలు చెబుతోందన్నారు. సీతారామ ప్రాజెక్టుకు టీఏసీ అనుమతి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని గుర్తు చేశారు.

పోలవరం, పట్టిసీమ, రాయలసీమ ఎత్తిపోతల పనులపై బీఆర్ఎస్ ఎందుకు మౌనం వహించిందో చెప్పాలని మంత్రి ఉత్తమ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ముందు కాళేశ్వరం ముడుపుల లెక్క చెప్పాలన్న మంత్రి ఉత్తమ్.. అందులో మీ వాటా ఎంతో చెప్పాలని హరీశ్ రావుని ప్రశ్నించారు. బేసిన్లు లేవు.. బేషజాలు లేవు అనేది బీఆర్ఎస్ సిద్ధాంతం అన్న ఆయన.. బీఆర్ఎస్ ద్వంద్వ విధానాలతో మేము నేర్చుకోవాల్సిసింది ఏమీ లేదన్నారు. తెలంగాణ నీటి హక్కుల రక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఏపీతో కుమ్మక్కై నాగార్జున సాగర్ ప్రాజెక్టును వివాదం చేసింది బీఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు. లక్ష కోట్ల కాళేశ్వరాన్ని ముంచి రాజకీయాలు చేస్తారా? అని మండిపడ్డారు.

12 ఏళ్లుగా ఏపీ ప్రభుత్వం ప్రతి బోర్డు సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తోందని, ఇది కొత్త విషయం కాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏపీ ప్రాజెక్టులకు పరోక్షంగా మద్దతిచ్చిన బీఆర్ఎస్ పార్టీ నేతలు అధికారం కోల్పోగానే కడుపు మంటతో బట్ట కాల్చి మీద వేస్తున్నారని మంత్రి విరుచుకుపడ్డారు. తెలంగాణ రైతాంగం ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీలేదని స్పష్టం చేశారు. ఈ నెల 18న జరిగే GRMB మీటింగ్ అజెండాలో చేర్చిన అంశాలు కొత్తవేమీ కావన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం గత ప్రభుత్వం కంటే సమర్థవంతంగా వాదనలు వినిపిస్తున్నామని మంత్రి ఉత్తమ్ చెప్పారు.

''రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్ల అధికారంలో బీఆర్ఎస్ ఏ రోజు తెలంగాణ ప్రయోజనాలు కాపాడలేదు. బీఆర్ఎస్ అధికారం లో ఉన్న సమయంలోనే

రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు జరిగింది వాస్తవం కాదా..? పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్ పనులు ప్రారంభం అయింది బీఆర్ఎస్ హయాంలో కాదా? పట్టిసీమ ఎత్తిపోతల పథకం మీరు అధికారంలో ఉండగా పూర్తి కాలేదా? తొమ్మిదిన్నరేళ్ళు తెలంగాణ సొమ్మును లూటీ చేసి… అధికారం కోల్పోగానే మొసలి కన్నీరు కారుస్తున్నారు'' అంటూ హరీశ్ పై మండిపడ్డారు మంత్రి ఉత్తమ్.

''ఈ నెల 18న జరిగే GRMB మీటింగ్ అజెండాలో చేర్చిన అంశాలు కొత్తవేమీ కావు. ఇవే అంశాలను మునపటి మీటింగ్ లలో, కరెస్పాండన్స్ లలో కూడా ప్రతిసారి ఏపీ ప్రస్తావిస్తూ వస్తున్నది. ఇవే అంశాలు సీతారామ ఎత్తిపోతల పథకం క్లియరెన్స్ విషయంలో కూడా ఏపీ ప్రస్తావించింది. దీనిపైన ఈ ప్రభుత్వం ధీటుగా స్పందించి అవన్నీ నిరాధారమైనవని GRMB, CWC దృష్టికి తీసుకెళ్లి SSMP - SRLIP TAC క్లియరెన్స్ విజయవంతంగా అనుమతులు సాధించింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నిరంతరం GRMB, CWC, జలశక్తి మంత్రిత్వ శాఖకు కాళేశ్వరం, సీతారామ, సమ్మక్క, చిన్న కాళేశ్వరం, చనాకా-కొరటా, మోదికుంట వాగు, గూడెం లిఫ్ట్ తదితర ఏడు ప్రాజెక్టుల అనుమతులు ఇవ్వరాదని కోరుతూ వచ్చింది. MoJS ద్వారా TAC క్లియరెన్స్ పొందిన తర్వాత కూడా సమీక్షించాలని ప్రతి మీటింగ్ లో ఏపీ ప్రస్తావిస్తోంది. ఏపీ లేవనెత్తిన అంశాలను ఈ ప్రభుత్వం ధీటుగా ప్రతిఘటించి మన రాష్ట్ర నీటి హక్కులను కాపాడడంలో సఫలీకృతుమైంది.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభత్వం ఎటువంటి ఉదాసీనత ప్రదర్శించటం లేదు. గత ప్రభుత్వమే 3వ GRMB మీటింగ్ లో రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి సంబంధించి, ఆయా రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరాలి లేదా ఒక ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని తన వైఖరి స్పష్టం చేసింది. ఈ రెండు రాష్ట్రాలకు నీటి సరఫరా నియంత్రణను GRMB ప్రారంభించే ముందే ఈ షరతులలో ఏదో ఒకటి నెరవేరాలని ఆ ప్రభుత్వం పేర్కొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండో APEX కౌన్సిల్ మీటింగ్ లో (06.10.2020) ట్రైబ్యునల్ ఏర్పాటు కోసం ఏపీతో పోటీ పడి కోరడం జరిగింది.

ఈ ప్రభుత్వం సమయస్ఫూర్తితో అడుగులు వేసి కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా ట్రిబ్యునల్ ఇప్పటివరకు ఏర్పడకుండా అడ్డుకుంది.

ఇదీ మా ప్రభుత్వం నిబద్ధత. అంతర్రాష్ట్ర వ్యవహారాల (ISM) డైరెక్టరేట్ క్లియరెన్స్, IP క్లియరెన్స్ పొందడంలో గత ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ముంపు సమస్యకు సంబంధించి కూడా గత ప్రభుత్వం ఆ రాష్ట్రంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదు.

ప్రస్తుత ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని చాలా సార్లు సంప్రదించి సందర్శించి, ISM డైరెక్టరేట్ క్లియరెన్స్ పొందడం కోసం ముంపు సమస్యకు సంబంధించి ఛత్తీస్‌గఢ్ నుండి నిరభ్యంతర పత్రం (NOC) పొందేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే NOC కోసం మూడుసార్లు ఛత్తీస్ గడ్ సీఎం ను కలిసి NOC కోసం విజ్ఞప్తి చేశాం. నెలాఖరులో NOC ఇస్తామని సీఎం చెప్పారు. మీరు అధికారంలో ఉండగా ఒక్కసారైనా ఛత్తీస్ గఢ్ సీఎంని కలిశారా?

ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యంతరాలను సమర్థవంతంగా ప్రతిఘటించి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బహుళార్దసాధక సీతమ్మ సాగర్ - సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు TAC అనుమతులు 24.04.2025 సాధించింది. తొమ్మిదిన్నరేళ్లలో మీరు చేయలేని పని మేము చేశాం. 60

టీఎంసీల నీటి కేటాయింపులు సాధించాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించినట్టుగా ట్రిబ్యునల్ ఏర్పరిచే విషయంలో కూడా ఈ ప్రభుత్వం

సమయస్ఫూర్తితో అడుగులు వేసి కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా ట్రిబ్యునల్ ఇప్పటివరకు ఏర్పడకుండా అడ్డుకుంది. ఇదీ ప్రభుత్వం నిబద్ధత.

PBLP ప్రతిపాదన గురించి తెలిసిన తర్వాత ఈ ప్రభుత్వం వెంటనే స్పందించడం జరిగింది. ఇప్పటివరకు ముఖ్యమంత్రి రెండు సార్లు, నీటిపారుదల శాఖ మంత్రిగా నేను ఏడుసార్లు, పది సార్లు ప్రధాన కార్యదర్శి, ENC (G) 19 సార్లు CWC, GRMB, KRMB, PPAలతో సుదీర్ఘమైన ఉత్తర ప్రత్యుత్తరాలు జరపబడ్డాయి. న్యాయపరమైన చర్యలో భాగంగా, ప్రభుత్వం సుప్రీంకోర్ట్ ముందు ఒరిజినల్ సూట్ IA వ్యాజ్యాలు వేయడం జరిగింది. ప్రతివాదులందరూ 4 వారాల్లోగా తమ సమాధానాలను దాఖలు చేయాలని న్యాయస్థానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

2018-2022 మధ్య కాలంలో రాయలసీమ ప్రాంతానికి 200 టీఎంసీల వరద నీటిని తరలించే పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినప్పటికీ, అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం ప్రేక్షకపాత్రకే పరిమితం కాలేదా? ఆర్డీఎస్ లో వాటా మేరకు నీళ్ల కోసం ఏరోజూ బీఆర్ఎస్ ప్రయత్నం చేయలేదు. ఆర్డీఎస్ ఆధునీకరణ విషయంలో ఏపీ, కర్ణాటక సీఎంలను ఒప్పించాం. మీరు ఏ రోజైనా కర్ణాటక సీఎంను కలిసి ఒప్పించారా? KWDTలో కృష్ణా జలాల వాటా కోసం స్వయంగా విచారణకు హాజరై న్యాయనిపుణులతో సూచన చేశా. గత ప్రభుత్వం కంటే సమర్థవంతంగా వాదనలు వినిపిస్తున్నాం.

రాష్ట్ర ప్రజల నీటి హక్కులను పరిరక్షించి, కాపాడేందుకు ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. బేసిన్లు లేవు.. బేషజాలు లేవు అనే సిద్ధాంతం కలిగిన బీఆర్ఎస్ ద్వంద విధానాలతో మేము నేర్చుకోవాల్సిసింది ఏమీ లేదు. తొలుత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏపీ కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు అందాయనే కవిత ఆరోపణలకు జవాబు చెప్పు. ఆ ముడుపుల్లో నీ వాటా ఎంత? తెలంగాణలో అధికారంలోకి రావడం లేదని ఏపీతో కుమ్మక్కై నాగార్జున సాగర్ ప్రాజెక్టును వివాదం చేసింది మీరు కాదా? లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును నిండా ముంచి సిగ్గు లేకుండా రాజకీయాలు చేస్తావా'' అని మాజీ మంత్రి హరీశ్ ను నిలదీశారు మంత్రి ఉత్తమ్.

#Uttam Kumar Reddy#Harish Rao#Brs#Congress#Telangana Politics#Irrigation Projects#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి