సినిమా

Raaka-Sharukh Khan: అల్లు అర్జున్ సినిమాలో షారుఖ్ ఖాన్..అసలు ట్విస్ట్ ఇదే..!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Raaka-Sharukh Khan: ఈ మధ్య కాలంలో బాలీవుడ్ స్టార్స్ మన సౌత్ సినిమాలలో, మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలలో కామియో రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్ సినిమాలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ అపీరియన్స్ ఇచ్చాడు. యాక్షన్స్ సీక్వెన్స్‌తో పాటు చిరు తో కలిసి ఒక సాంగ్‌లో అలరించాడు. మెగా ఫ్యామిలీ తో ఉన్న అనుబంధం కారణంగానే సల్మాన్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా గాడ్ ఫాదర్‌లో చేశాడు.

అయితే, సల్మాన్ యాడ్ అయినా కూడా, మెగాస్టార్ గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. ఇలాంటి గెస్ట్ అపీరియన్సెస్ చాలానే జరిగాయి. రజినీకాంత్ కూలీ సినిమాలోనూ మన సౌత్ స్టార్స్ నటించారు. వారికి ఆ రోల్స్ పెద్దగా కలిసి రాలేదు. నాగార్జున సన్నిహితులు ఇదే అన్నారు కూడా. అయితే, మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా రాకా లో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కామియో రోల్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

కానీ, ఇవన్నీ సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన పుకార్లే తప్ప ఇందులో ఎంతమాత్రం నిజం లేదని తెలుస్తోంది. గతంలో, అట్లీ దర్శకత్వంలో షారుఖ్..జవాన్ అనే సినిమా చేశాడు. ఈ సినిమాతో చాలా కాలంగా ఫ్లాపుల్లో షారుఖ్ కి సాలీడ్ హిట్ దక్కింది. ఆ బాండింగ్‌తోనే రాకా కోసం కామియో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ, ఇది అవాస్తవం అని కోలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం.

కాగా, ఈ సినిమా ప్రస్తుతం ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వాస్తవానికి, దుబాయ్ సహా పలు దేశాలలో చిత్రీకరణ జరపాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధం కారణంగా.. ఆ షెడ్యూల్స్ అన్నీ క్యాన్సిల్ చేసి..మొత్తం షూటింగ్ మొంబైలోనే జరుపుతున్నారు. సన్ పిక్చర్ దాదాపు 700 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తోంది. దీపిక పడుకొణ్, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్.

#alluarjun#raaka#atleekumar#sharukhkhan#deepikapadukone
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి