Naga Chaitanya: అక్కినేని హీరోలలో అఖిల్ ఇటీవలే లెనిన్ సినిమాతో వచ్చి మంచి హిట్ అందుకున్నాడు. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ సినిమా నిలిచింది. అఖిల్ కెరీర్ లో 100 కోట్ల మార్క్ చేరుకున్న సినిమా ఇది. హీరోయిన్ భాగ్యశ్రీబోర్సే కి కూడా మొదటి హిట్ అని చెప్పాలి. ఇప్పుడు, అక్కినేని నాగ చైతన్య రెడీ అవుతున్నాడు. లవ్ స్టోరీ, తండేల్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న చైతూ, ఇప్పుడు వృషకర్మ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదొక మిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా రూపొందుతుండటం విశేషం. ఇప్పుడు, అక్కినేని అభిమానుల దృష్టి ఈ చిత్రంపైనే ఉంది. ఇక, ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కావచ్చిందని సమాచారం. రీసెంట్ గా వచ్చిన టీజర్ కు అటు అభిమానుల నుంచి ఇటు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. దీంతో, వృషకర్మ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రైట్స్ లాంటి బిజినెస్ కూడా పూర్తైంది.
అయితే, తాజా సమాచారం మేరకు.. ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే, ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా డిసెంబర్ 3న రిలీజ్ అని ప్రకటించారు. డేట్ కన్‌ఫర్మ్ కాలేదు గానీ, విజయ్ దేవరకొండ-కీర్తి సురేష్ నటిస్తున్న రౌడీ జనార్ధన కూడా డిసెంబర్ లోనే వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అలాగే, అక్కినేని నాగార్జున నటిస్తున్న కింగ్ 110వ సినిమాను ఇదే డిసెంబర్ కి ప్లాన్ చేస్తున్నారట. అయినా, కూడా నాగ చైతన్య చూపు డిసెంబర్ నెలపైనే ఉందని తెలుస్తోంది. వరుసగా క్రిస్మస్, సంక్రాంతి సెలవులతో ఎక్కువ హాలిడేస్ వస్తాయని ఇలా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో చైతూ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. బివిఎస్‌ఎన్ ప్రసాద్-సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్నాయి. త్వరలోనే అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.












