Tollywood: మన సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే కొలమానం. మిగిలినవన్నీ తర్వాతే. నాలుగు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడైనా సరే ఒక్క ఫ్లాప్ ఇస్తే మాత్రం మళ్ళీ మొదటి నుంచి అన్నీ ఎత్తుకోవాల్సిందే. ఇప్పుడు మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాస్ అండ్ యాక్షన్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను పరిస్థితి ఇలాగే ఉందంటున్నారు.
ఆయన కెరీర్‌లో ఎక్కువ హిట్స్ ఇచ్చింది ఒక్క నందమూరి బాలకృష్ణకి మాత్రమే. మొదటి సినిమా మాస్ మహారాజ్ రవితేజతో చేసిన భద్ర. ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ సాధించింది. అలాగే, వెంకటేష్ హీరోగా వచ్చిన తులసి, అల్లు అర్జున్ తో చేసిన సరైనోడు బ్లాక్ బస్టర్స్. కానీ, ఎన్‌టిర్ తో చేసిన దమ్ము, రామ్ చరణ్ తో చేసిన వినయ విధేయ రామ, రామ్ హీరోగా వచ్చిన స్కంద, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన జయ జానకి నాయక ఫ్లాప్ అయ్యాయి.
బాలయ్యతో సింహ, లెజెండ్, అఖండ, అఖండ 2 చిత్రాలు తీసిన బోయపాటి మూడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. ఆ నమ్మకంతో అఖండ 2 తీశాడు. ఇందులో అతి మరీ ఎక్కువైందని నందమూరి అభిమానులే కామెంట్స్ చేశారు. వాస్తవంగా చెప్పాలంటే బోయపాటిని సోషల్ మీడియాలో బాగానే ట్రోల్ చేస్తుంటారు. సినిమా ఎంట్రీనే ఆయన మీద తీసుకుంటాడు. ఇదే, ఆయన ట్రోల్ అవడానికి కారణం.
ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలయ్య తప్ప బోయపాటికి సరైన ఆప్షన్ కనిపించడం లేదు. ఈయన దెబ్బకి యంగ్ హీరోలు తట్టుకోలేకపోతున్నారు. అందుకే, బోయపాటికి ఏ హీరో డేట్స్ ఇవ్వాలన్నా ఎస్కేప్ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. మోన్నా మధ్య బాలీవుడ్‌కి వెళతాడని వార్తలు వచ్చాయి. దీనికి, విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. మరి, ఇలాంటి నేపథ్యంలో బీయపాటికి హీరో దొరికేనా? ఆ హీరో ఎవరు?












