సినిమా

Sandeep Reddy Vanga: ప్రభాస్ స్పిరిట్ కి లాంగ్ బ్రేక్..కారణం!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Sandeep Reddy Vanga: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి స్పిరిట్. తాజాగా, చిత్ర దర్శకుడు సినిమాకి సంబందించిన అప్‌డేట్ ను పంచుకున్నాడు. గత మూడు నాలుగు రోజుల క్రితం వరకూ నాన్ స్టాప్‌గా షూటింగ్ జరిమాపని..ప్రస్తుతం బ్రేక్ ఇచ్చామని చెప్పాడు. ఈ బ్రేక్ కూడా నెల రోజులని క్లారిటీ ఇచ్చాడు.

ఇండస్ట్రీలో చాలా కొద్దిమంది దర్శకులే తాము అనుకున్న కథను అనుకున్నట్టుగా తీస్తారు. ఎక్కడా కాంప్రమైజ్ కారు. అలాంటి వారిలో ఆర్జీవీ తర్వాత సందీప్ రెడ్డి వంగ ఉండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ పాంట్ లో ఐస్ క్యూబ్స్ పెట్టుకునే సీన్ కానివ్వండి..అనిమల్ సినిమాలో త్రిప్తీతో రణబీర్ బెడ్‌రూం సీన్ కానివ్వండీ..ఇది, ఇలా తీస్తేనే ఆ సీన్ కి న్యాయం జరుగుతుందని నమ్మే దర్శకుడు.

అలాంటి, దర్శకుడితో ప్రభాస్ సినిమా అంటే భయపడిన అభిమానులూ ఉన్నారు..వావ్ అని ఎగ్జైట్ అయిన అభిమానులూ ఉన్నారు. ఇక, స్పిరిట్ అనే టైటిల్..కాప్ రోల్ లో ప్రభాస్ అనే విషయాలే పెద్ద చర్చకి కారణమయ్యాయి. ఇక ఫస్ట్ లుక్ లో పొడవాటి జుట్టు..వీపు మొత్తం బాండేజెస్, చేతిలో మందు గ్లాసు..గాగూల్స్, చీరకట్టులో హీరోయిన్..ఇవన్నీ సంథింగ్ స్పెషల్ గా అనిపించాయి.

అందుకే, స్పిరిట్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, ప్రభాస్ ఫౌజీ సినిమా షూటింగ్‌లో ఆగస్టు మొత్తం లాకయ్యాడు. దాంతో, ఈ సినిమాకి ఒక నెలరోజుల పాటు సందీప్ రెడ్డి వంగ బ్రేక్ ఇచ్చాడు. మళ్ళీ, వచ్చే నెల నుంచి కొత్త షెడ్యూల్ ని ప్రారంభించబోతున్నట్టుగా వెల్లడించాడు. ఇప్పటి వరకూ షూట్ చేసిన అవుట్‌పుట్ సూపర్బ్ గా వచ్చిందన్నాడు సందీప్. వచ్చే ఏడాది స్పిరిట్ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

#SandeepReddyVanga#Prabhas#TriptiDimri#Spirit
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి