ఏపీ

Ap : ఏపీలో దారుణం.. గొడవ పెట్టుకుందని యువతిపై కారు ఎక్కించి!

రచన: Kumar3 నిమిషాల పఠనం

ఏపీలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఇద్దరు యువకులు ఓ యువతితో గొడవకు దిగారు. అనంతరం ఆమెను వెంబడించి మరీ కారుతో ఢీకొట్టి హతమార్చారు. ఈ ఘటన ఏపీలోని రాజమండ్రిలో చోటుచేసుకోగా గురువారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.

ఏపీలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఇద్దరు యువకులు ఓ యువతితో గొడవకు దిగారు. అనంతరం ఆమెను వెంబడించి మరీ కారుతో ఢీకొట్టి హతమార్చారు. ఈ ఘటన ఏపీలోని రాజమండ్రిలో చోటుచేసుకోగా గురువారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. ఈ నెల 3వ తేదీన రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్డులోని ప్రసాదిత్యా మాల్‌కు సినిమా చూసేందుకు జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రియాంక (28) వెళ్లింది.అయితే, ప్రసాదిత్యా మాల్ పార్కింగ్ ప్రాంతంలో వాహనం నిలిపే క్రమంలో నామవరం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులతో ఆమెకు స్వల్ప వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన వ్యక్తులు.. అతివేగంగా కారు నడుపుతూ స్కూటీపై వెళ్తున్న జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రియాంకను వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు.

https://x.com/TeluguScribe/status/2085226034652192893?s=20

ఆమె రోడ్డుపై పడిపోగా వాహానాన్ని తలపై నుంచి పోనివ్వడంతో బాధితురాలిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు.అయితే, పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో బాధితురాలిని హైదరాబాద్‌‌కు తరలించారు. చికిత్స పొందుతూ మెడికల్ కాలేజీ విద్యార్థిని బ్రెయిన్ డెడ్‌ అయ్యిందని వైద్యులు నిర్ధారించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను ప్రకాష్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులోనే వారు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలిసింది.

#medical student#accident#brain dead#two men arrest#car hit
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి