Actress Meena: కొందరు నటీమణులు ఎంతో గొప్పగా, ఉన్నతంగా ఆలోచిస్తారు. ఇలాంటి గుణాలు, లక్షణాలు తల్లిదండ్రుల నుంచి వస్తాయి..కొందరు సమాజాన్ని బట్టి..చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా, అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు. సీనియర్ నటి మీనా కూడా సినిమా ఇండస్ట్రీకొచ్చాక ఎన్నో విషయలను తెలుసుకుంది. ముఖ్యంగా, సమాజం పట్ల లింగ వివక్ష, కుల-మతాల విషయంలో ఒక వైఖరిని నేర్చుకుంది.
దీని గురించే ఆమె తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మీనా చిన్న తనం నుంచే సినిమాల్లో నటిస్తూ వచ్చింది. చైల్డ్ ఆర్టిస్టుగానే ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అవార్డులు సంపాదించుకుంది. ఆ తర్వాత హీరోయిన్‌గా ఇటు సౌత్ సూపర్ స్టార్స్ తో నటించింది. మీనా ఎక్కువగా తెలుగు, తమిళం, మలయాళం భాషలలో నటించింది. కన్నడ, హిందీ చిత్రాలు తక్కువే అని చెప్పాలి.
మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, జగపతిబాబు, మోహన్ బాబు, రజినీకాంత్ ఇలా పలువురు సీనియర్ స్టార్స్ తో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. ఒకదశలో మీనా డేట్స్ దొరకడం కూడా కష్టమైంది. పెళ్లి తర్వాత సినిమాలకి దూరంగా మీనా..మళ్ళీ దృశ్యం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. కరోనా తర్వాత భర్త మరణం మీనాను చాలా కృంగదీసింది. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకుంటుందని పలు రూమర్లు వచ్చాయి.
వేటికి పెద్దగా స్పందించని మీనా, ఇటీవల మనిషి పుట్టాకే కులం, మతం, లింగం వచ్చాయని, వాటి గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. ప్రతీ రోజూ మంచి పని చేయడానికి, మంచి మనిషిగా ఉండటానికే ప్రయత్నించాలని తెలిపింది. ఒక మనిషికి నిజమైన గుర్తింపు అంటే అతని గుణగణాలు, చేసే పనులు, ఇతరుల పట్ల చూపించే మానవత్వం..వీటి గురించే గర్వపడాలని తెలిపింది. ప్రస్తుతం మీనా అన్న ఈ మాటలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.












