వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ యువతి తన చెయ్యిని కోల్పోయింది.చెవి నొప్పిగా ఉందని ఆస్పత్రికి వెళ్లిన యువతికి అక్కడి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఏకంగా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. కానీ అదృష్టవశాత్తు చెయ్యి కోల్పోయి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో వెలుగు చూసింది.
వివరాల్లోకివెళితే.. చెవి నొప్పిగా ఉండటంతో చికిత్స కోసం మహావీర్ ఆరోగ్య సంస్థాన్‌కి రేఖ(20)అనే యువతి వెళ్లింది.అయితే.. చికిత్స టైంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆమెకి తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చినట్టు తెలిసింది. దాంతో ఆమె చెయ్యి ఆకుపచ్చ రంగులోకి మారగా.. తీవ్ర నొప్పితో రేఖ విలవిలలాడింది. మొదట్లో అదేం పెద్ద సమస్య కాదని చెప్పి వైద్యులు పెద్దగా పట్టించుకోలేదు.
కానీ నొప్పి భరించలేక పలు ఆసుపత్రులకు తిరిగి, చివరికి ‘మేదాంత’ హాస్పిల్‌కి వెళ్లగా.. ప్రాణాలతో ఉండాలంటే చెయ్యి తొలగించాల్సిందేనని రేఖకు వైద్యులు తేల్చి చెప్పారు. ఆ తప్పుడు ఇంజెక్షన్ కారణంగా మొత్తం ఇన్ ఫెక్షన్ సోకినట్టు వైద్యులు తేల్చారు. ఫలితంగా నరాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.చివరకు చెయ్యి తొలగించేందుకు యువతి అంగీకరించడంతో.. మోచేతి పైభాగం వరకు తొలగించారు.
ఈ ఘటన కారణంగా తనకొచ్చిన పెళ్లి సంబంధం కూడా రద్ద అవ్వడంతో యువతి కన్నీరుమున్నీరయ్యింది.మహావీర్ ఆరోగ్య సంస్థాన్ వైద్యుల నిర్లక్ష్యానికి తన జీవితం నాశనమైందంటూ రేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://x.com/pulsenewsbreak/status/2085171749117968742?s=20












