Spirituality

Spirituality: నిజమైన క్షత్రియ ధర్మం అంటే ఏమిటి?..

రచన: Venu4 నిమిషాల పఠనం

యుద్ధం అంటే కేవలం ఆయుధాలతో చేసే పోరాటం కాదు. మన జీవితంలో కూడా ప్రతిరోజూ ఒక యుద్ధమే జరుగుతోంది. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే అంతర్గత శత్రువులతో చేసే పోరాటమే నిజమైన ధర్మయుద్ధం.

నిజమైన క్షత్రియుడు అంటే కత్తి పట్టినవాడు కాదు... ధర్మం కోసం నిలబడినవాడు. శాస్త్రాలు చెప్పే క్షత్రియ ధర్మం యుద్ధం చేయడం మాత్రమే కాదు... అధర్మాన్ని అడ్డుకోవడం, బలహీనులను రక్షించడం, న్యాయాన్ని నిలబెట్టడం.

"క్షతాత్ త్రాయతే ఇతి క్షత్రియః" అనే సంస్కృత వ్యాఖ్యం ప్రకారం... "క్షతం" అంటే బాధ, అన్యాయం, అపాయం.. వాటి నుంచి ప్రజలను కాపాడేవాడే క్షత్రియుడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన బోధ ఇదే. బంధువులు ఎదురుగా ఉన్నారని యుద్ధం చేయకుండా వెనక్కి తగ్గడం కరుణ కాదు.. ధర్మాన్ని వదిలేయడమే. అందుకే శ్రీ కృష్ణుడు చెప్పాడు.. "ధర్మం కోసం చేసే యుద్ధం పవిత్రమైన కర్తవ్యం." అని..

కానీ ఇక్కడ యుద్ధం అంటే కేవలం ఆయుధాలతో చేసే పోరాటం కాదు. మన జీవితంలో కూడా ప్రతిరోజూ ఒక యుద్ధమే జరుగుతోంది. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే అంతర్గత శత్రువులతో చేసే పోరాటమే నిజమైన ధర్మయుద్ధం. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే.. ప్రతి మనిషిలో ఒక క్షత్రియుడు ఉన్నాడు. ఎక్కడ అన్యాయం జరిగినా మౌనంగా ఉండకుండా సత్యం కోసం నిలబడతాడో... ఎప్పుడు బలహీనులకు అండగా ఉంటాడో... ఎప్పుడు తన స్వార్థాన్ని పక్కన పెట్టి ధర్మాన్ని ఎంచుకుంటాడో.. అలాంటి వ్యక్తి క్షత్రియ ధర్మాన్ని ఆచరిస్తున్నట్లే.

రామాయణంలో శ్రీరాముడు రావణుడిపై యుద్ధం చేశాడు. అది వ్యక్తిగత కోపం వల్ల కాదు... ధర్మ రక్షణ కోసం. మహాభారతంలో పాండవులు యుద్ధం చేశారు. అది రాజ్యం కోసం కాదు... న్యాయం కోసం. క్షత్రియ ధర్మం మనకు చెప్పే గొప్ప సందేశం ఏమిటంటే... ధర్మం ముందు భయం ఉండకూడదు. సత్యం ముందు స్వార్థం నిలవకూడదు. న్యాయం ముందు బంధుత్వం కూడా అడ్డుకావద్దు.

అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి... ధర్మాన్ని కాపాడేవారిని ధర్మమే కాపాడుతుంది. "ధర్మో రక్షతి రక్షితః" అనే ఈ మహావాక్యం క్షత్రియ ధర్మానికి ప్రాణం. కాబట్టి క్షత్రియ ధర్మం అనేది ఒక కులానికి మాత్రమే సంబంధించినది కాదు. ధర్మం కోసం నిలబడే ప్రతి హృదయంలో ఉండాల్సిన జీవన విధానం. అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండకుండా.. సత్యాన్ని ధైర్యంగా ఆచరించడమే నిజమైన క్షత్రియ ధర్మం.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.

#Spirituality#Kshatriya Dharma#true#War#life#lust#anger#greed#delusion#arrogance
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి