National

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. పలు రూట్లలో ప్రత్యేక రైళ్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే..!

రచన: Venu4 నిమిషాల పఠనం

పండుగలు, సెలవుల నేపథ్యంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టినట్లు తెలిపిన రైల్వే అధికారులు.. ప్రయాణికులు ముందుగానే తమ టికెట్లు బుక్ చేసుకుని, ప్రయాణానికి ముందు అధికారిక షెడ్యూల్‌ను ఒకసారి పరిశీలించాలని సూచిస్తున్నారు.

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పలు కీలక మార్గాల్లో వీక్లీ ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. కోయంబత్తూర్–జైపూర్, బాంద్రా టెర్మినల్–వేళంకన్ని, పూరీ–సోలాపూర్ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

ముందుగా కోయంబత్తూర్–జైపూర్ ప్రత్యేక రైలు నంబర్ 06181 ఈ నెల 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు ప్రతి వారం నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో జైపూర్–కోయంబత్తూర్ ప్రత్యేక రైలు నంబర్ 06182 ఈ నెల 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు ప్రయాణికులకు సేవలు అందించనుంది.

ఇక బాంద్రా టెర్మినల్–వేళంకన్ని ప్రత్యేక రైలు నంబర్ 09059 ఈ నెల 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు నడవనుంది. వేళంకన్ని–బాంద్రా ప్రత్యేక రైలు నంబర్ 09060 ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. అలాగే పూరీ–సోలాపూర్ ప్రత్యేక రైలు నంబర్ 08445 ఆగస్టు 7న ఒక ప్రత్యేక సర్వీస్‌గా ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

కోయంబత్తూర్–జైపూర్ ప్రత్యేక రైళ్లు తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేట, కాట్పాడి, రేణిగుంట, కడప, యర్రగుంట్ల, గూటి, ధోనే, కర్నూలు సిటీ, గద్వాల్, మహబూబ్‌నగర్, కాచిగూడ, కామారెడ్డి, నిజామాబాద్, బాసర్, నాందేడ్, అకోలా, భుసావల్, వడోదర, రత్లాం, అజ్మీర్‌తో పాటు మరికొన్ని ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైళ్లలో పూర్తిగా త్రీ-ఏసీ కోచ్‌లనే ఏర్పాటు చేశారు.

బాంద్రా–వేళంకన్ని ప్రత్యేక రైళ్లు బోరివలి, వాసాయి రోడ్, పన్వెల్, పూణే, షోలాపూర్, వాడి, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గూటి, కడప, రేణిగుంట, కాట్పాడి, తిరువణ్ణామలై, విల్లుపురం, నాగపట్టినం వంటి ముఖ్య స్టేషన్లలో ఆగుతాయి. వీటిలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

అలాగే పూరీ–సోలాపూర్ ప్రత్యేక రైలు ఖుర్దా రోడ్, బ్రహ్మపూర్, విజయనగరం, దువ్వాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, వాడి, కలబురగి స్టేషన్లలో ఆగుతాయి. పండుగలు, సెలవుల నేపథ్యంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టినట్లు తెలిపిన రైల్వే అధికారులు.. ప్రయాణికులు ముందుగానే తమ టికెట్లు బుక్ చేసుకుని, ప్రయాణానికి ముందు అధికారిక షెడ్యూల్‌ను ఒకసారి పరిశీలించాలని సూచిస్తున్నారు.

#National#indian railway#Special trains#passengers#Good news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి