Agri Gold Lands: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించింది. అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని కేబినెట్ సబ్ కమిటీ తెలిపింది. 6 వేల ఎకరాల అగ్రిగోల్డ్ భూములను వేలానికి సిద్ధం చేశామని, వేలం ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని సీఐడీని ఆదేశించామని వెల్లడించింది.
అగ్రిగోల్డ్ సంస్థ రూ.6 వేల కోట్ల డిపాజిట్లు సేకరించింది. ఏపీ నుంచే రూ.3 వేల కోట్ల డిపాజిట్లు సేకరించింది. అగ్రిగోల్డ్ బాధితుల వివరాల కోసం ప్రత్యేక వెబ్ సైట్ తెస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బాధితులకు బాండ్లు అందించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. సెప్టెంబర్ 15లోగా బాండ్ల ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు చేపట్టామన్నారు. అగ్రిగోల్డ్ పై ఈ నెల 11న సీఎస్ తో కీలక సమీక్ష సమావేశం జరగనుందన్నారు. ఆగస్టు 15లోగా అగ్రిగోల్డ్ కేసులపై ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.












