Tejaswini Nandamuri: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తనయ నందమూరి తేజస్విని సిల్వర్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇవ్వబోతుందా..? ప్రస్తుతం అవుననే మాట ఫిల్మ్ సర్కిల్స్‌లో, నందమూరి అభిమానుల్లో బాగా వినిపిస్తోంది. గత కొన్నేళ్ళుగా బాలయ్య వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఉంటుందని స్వయంగా బాలయ్యే స్టేజ్ మీద వెల్లడించాడు. మంచి కథలను కూడా సెలెక్ట్ చేశానని చెప్పాడు.
ఆ మధ్య ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో.. మోక్షజ్ఞ హీరోగా సినిమా కూడా మొదలైందని, ప్రచారం జరిగింది. అలాగే, ఆగిపోయిందని వార్త సోషల్ మీడియాలో వచ్చి వైరల్ అయింది. ఎమైందో ఏమో గానీ మళ్ళీ ఇప్పటి వరకూ తనయుడి సినిమా ఊసే లేదు. బాలయ్య, మాత్రం వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఎన్‌బీకే 111, 112లతో బిజీగా ఉన్నాడు.

అయితే, బాలయ్య చిన్న కూతురు నందమూరి తేజస్విని ప్రధాన పాత్రలో ఫీమేల్ సెంట్రిక్ మూవీకి సన్నాహాలు జరుగుతున్నట్టుగా తాజా సమాచారం. ఈ సినిమాను వరుడు కావలెను సినిమాతో ఇండస్ట్రీకి దర్శకురాలిగా పరిచయమైన లక్ష్మీ సౌజన్య ఎంపికైనట్టుగా తెలుస్తోంది. ఇటీవలే, ఆమె తేజస్వినితో కలిసింది. ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయట. ఆ సమయంలో దిగిన ఓ పిక్ ని షేర్ చేసిన లక్ష్మీ సౌజన్య..ఒక పోస్ట్ పెట్టింది.
దీనిని బట్టే..నందమూరి తేజస్విని డెబ్యూ మూవీ కన్‌ఫర్మ్ అయిందన్నట్టుగా వార్తలు వచ్చాయి. మరి, దీనికి సంబందించిన అధికారిక ప్రకటన, నిర్మాణ సంస్థ..ఇతర వివరాలు ఎప్పుడు వెల్లడవుతాయో చూడాలి. నందమూరి అభిమానులు మాత్రం తేజస్విని ఎంట్రీ కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. ఇక, ఇటీవల డాన్స్ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్‌తో కలిసి తేజస్విని చేసిన డాన్స్ వీడియో అంతటా బాగా వైరల్ అయింది.












