తెలంగాణ

TG : ఎస్ఐఆర్ ఎఫెక్ట్.. రాష్ట్రంలో 60 లక్షల ఓట్లు డిలీట్?

రచన: Kumar4 నిమిషాల పఠనం

తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రకియ పూర్తయ్యే వరకు సుమారు 60 లక్షల ఓట్లు డిలీట్ అయ్యే చాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు డబుల్ ఓట్లు, మరణించిన వారి ఓట్లు, వలసలు పోయిన వారి ఓట్లను అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఇళ్లు మారిన ఓటర్ల వివరాలు సేకరించడంలో బీఎల్‌వోలు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రకియ పూర్తయ్యే వరకు సుమారు 60 లక్షల ఓట్లు డిలీట్ అయ్యే చాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు డబుల్ ఓట్లు, మరణించిన వారి ఓట్లు, వలసలు పోయిన వారి ఓట్లను అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఇళ్లు మారిన ఓటర్ల వివరాలు సేకరించడంలో బీఎల్‌వోలు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది.

ఇక చనిపోయినవారు, డూప్లికేట్‌ ఓట్లు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడకు పని కోసం వచ్చిన వారికి ఓట్లు ఉంటే వాటిని కూడా గుర్తించి తొలగిస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్యూమరేషన్‌ ఫారామ్స్ సమర్పణకు కేవలం ఐదు రోజులే సమయం ఉంది. ఈనెల 10తొ గడువు ముగియనుంది. దీంతో ఎన్నికల అధికారులు ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఓటర్లను గుర్తించి, వివరాలు నమోదు చేయడంపై బూత్‌స్థాయి అధికారులు (బీఎల్‌వోలు), మరోవైపు వివిధ పార్టీలకు చెందిన బూత్‌ స్థాయి ఏజెంట్లు సైతం కీలకంగా వ్యవహరిస్తున్నారు.

నిర్ణీత అడ్రసుల్లో లేనివారు ఎక్కడికి వెళ్లారు? వలస పోయారా? స్థానికంగా మరోచోటుకు మారారా? అనేది ఇరుగుపొరుగును ఆరా తీసి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. నిన్నటికి 77.66 శాతం ఓటరు డిజిటలైజేషన్‌ పూర్తయిందని అధికారులు పేర్కొన్నారు. ఎస్ఐాఆర్ ప్రక్రియ హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో చాలా నెమ్మదిగా సాగుతోందని, భారీ సంఖ్యలో ఓటర్లు ఉండటం, అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, చిరునామా గుర్తింపు, నిర్ధారణలో బూత్ లెవల్ ఆఫీసర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

మొత్తంగా ఎస్ఐఆర్ (సమగ్ర ఓటరు జాబితా సవరణ) ప్రక్రియ పూర్తయ్యే నాటికి రాష్ట్రంలో 60 లక్షలకు పైగా ఓట్లు డిలీట్ అయ్యే అవకాశం ఉందని సంబంధిత విభాగాలు అంచనా వేస్తున్నాయి. దాదాపు 40 లక్షల మంది ఓటర్లు తమ అడ్రసుల్లో అందుబాటులో లేరని అధికారులు గుర్తించారు. చనిపోయినవారు, రెండు, మూడు చోట్ల కలిగి ఉన్నవారు, రాష్ట్రంలో ఓటు నమోదు చేసుకున్న ఇతర రాష్ట్రాలవారు అందరినీ కలిపి మరో 20 లక్షల వరకు ఉంటారని అంచనా వేస్తున్నారు.

#SIR#telangana#60lacs votes#deletion#hyderabad
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి