సినిమా

Film News: ఇక్కడ బాలయ్య హిట్..అక్కడ విజయ్ ఫ్లాప్!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Film News: సాధారణంగా ఒక భాషలో తీసిన సినిమాను ఇంకో భాషలో డబ్బింగ్ చేసి వదులుతారు. పక్క రాష్ట్రంలో ఆ హీరోకి ఉన్న క్రేజ్ ని బట్టి లేదంటే కంటెంట్ లో దమ్మును బట్టి అది డబ్బింగ్ వర్షన్ హిట్ లేదా ఫ్లాపవుతూ ఉంటుంది. ఇక, రీమేక్ విషయంలో అయితే, ఒక్కోసారి ఒరిజినల్ కంటే రీమేక్ సినిమాలే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతాయి.

Film News: సాధారణంగా ఒక భాషలో తీసిన సినిమాను ఇంకో భాషలో డబ్బింగ్ చేసి వదులుతారు. పక్క రాష్ట్రంలో ఆ హీరోకి ఉన్న క్రేజ్ ని బట్టి లేదంటే కంటెంట్ లో దమ్మును బట్టి అది డబ్బింగ్ వర్షన్ హిట్ లేదా ఫ్లాపవుతూ ఉంటుంది. ఇక, రీమేక్ విషయంలో అయితే, ఒక్కోసారి ఒరిజినల్ కంటే రీమేక్ సినిమాలే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతాయి. కానీ, జన నాయగన్ లాంటి కొన్ని సినిమాలు మాత్రం ఊహించని షాకునిస్తాయి.

తెలుగులో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ విజయాన్ని అందుకుంది. బాలకృష్ణ, శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు..వీరిపై అనిల్ రావిపూడి తెరకెక్కించిన క్లైమాక్స్ భారీ హిట్ కి కారణమయ్యయి. కాజల్ రీ ఎంట్రీ కూడా కలిసి వచ్చింది. ముఖ్యంగా, బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్, హెవీ యాక్షన్ సీన్స్ సినిమాను నెక్స్ట్ లెవల్‌లో నిలబెట్టాయి.

అయితే, ఇదే కథను హెచ్ వినోథ్ కోలీవుడ్ స్టార్ విజయ్ తో జన నాయగన్ పేరుతో రూపొందించాడు. లుక్స్, టీజర్, ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరికీ ఇది భగవంత్ కేసరి కథ అని అర్థమైంది. కానీ, దాన్ని దర్శకుడు ఘోరంగా తోసిపుచ్చాడు. రెండు వేరు వేరు కథలని బుకాయించాడు. తీరా సినిమా రిలీజైయ్యాక చూస్తే 90 శాతం భగవంత్ కేసరి సినిమాను మక్కీకి మక్కీ దింపేశాడు.

ఇదే, జన నాయగన్ డిజాస్టర్‌కి కారణమైంది. చాలాచోట్ల ఘోర పరాజాన్ని చూసింది. బ్రేకీవెన్ కి ఆమడ దూరంలో ఆగిపోయింది. 203 కోట్ల థియేట్రికల్ బిజినెస్ తో రిలీజైన ఈ సినిమా 135 కోట్ల వరకే కలెక్షన్స్ వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్ అంతా దాదాపు 30 శాతం లాస్ అయ్యారు. విజయ్ కెరీర్‌లో చివరి సినిమా అని అభిమానులు ఎంతో ఆశగా వెళితే, నిరాశ తప్పలేదు. మరి, సీఎం గా ఉన్న విజయ్ తన డిస్ట్రిబ్యూటర్స్ కి ఎలా న్యాయం చేస్తాడో చూడాలి.

#balayya#vijay#bhagavanth kesari#jana nayagan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి