హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో సహచర ట్రైనీ మహిళ ఐపీఎస్ మీద లైంగికవేధింపులు, దాడి కేసులో అరెస్టు అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. పోలీసుల విచారణలో ఆయన షాకింగ్ నిజాలు వెల్లడించినట్టు తెలిసింది. ‘నేను సివిల్స్ సాధించాక నా స్ఫూర్తిదాయక కథనాలు చూసి సోషల్ మీడియాలో వేలమంది అభిమానులుగా మారారు.
అందులో కొందరు మహిళలు నాకు ప్రపోజ్ చేస్తే ఓకే చెప్పా.. దాంట్లో తప్పేముంది?’ అని సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. కాగా, ట్రైనీ ఐపీఎస్‌తో ప్రేమ వ్యవహారం నడిపిన ఉదయ్ కృష్ణారెడ్డి.. ఆమె భర్తకు సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫోటోస్ పంపడంతో పాటు కత్తి చూపించి బెదిరించడం, దాడి చేసినట్టు ఆధారాలను చూపిస్తూ బాధిత ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదుతో పోలీసులు కేసు ఫైల్ చేసి ఉదయ్‌ను అరెస్టు చేశారు.అనంతరం కోర్టు అనుమతి ద్వారా కస్టడీకి తీసుకోని విచారిస్తున్నారు. విచారణలో భాగంగా ట్రైనీ ఐపీఎస్‌కు మరో మహిళతో ఎఫైర్ ఉందని గుర్తించారు.
2014లో వివాహమైన మరో మహిళతోనూ ఉదయ్ కృష్ణారెడ్డి సన్నిహిత సంబంధం నడిపినట్టు తేల్చారు.2023 నుంచి భర్తకు దూరంగా కుమారుడితో ఉంటున్న ఆ మహిళతో పరిచయం పెంచుకున్న ఉదయ్.. హైదరాబాద్ వచ్చి కొంతకాలం ప్రైవేట్ జాబ్ చేసి.. ఉదయ్ కృష్ణారెడ్డి సూచనతో ఆ జాబ్ మానేసి అశోక్‌నగర్‌లోని ఓ ఐఏఎస్ ఇన్‌స్టిట్యూట్‌లో సదరు మహిళ చేరినట్టు కనుగొన్నారు.లివ్-ఇన్ రిలేషన్‌లో ఉందామని ఉదయ్ కృష్ణారెడ్డి కోరినా.. ఇంకా విడాకులు రాలేదని సదరు మహిళ తిరస్కరించినట్టు గుర్తించారు.
https://x.com/TeluguScribe/status/2084868977889796491?s=20
అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో సదరు మహిళను కలిసి ఉదయ్ కృష్ణారెడ్డి తనపై దాడి చేసి విపరీతంగా కొట్టాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆమెకు తెలపగా.. దీంతో ఆ మహిళ ఉదయ్ కృష్ణారెడ్డిని దూరం పెట్టినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు.అశోక్‌నగర్‌లోని ఉదయ్ కృష్ణారెడ్డి గదిలో ల్యాప్‌టాప్, ఫోన్, రెండు ప్రేమలేఖలు, కత్తి స్వాధీనం చేసుకున్నారు.ఉదయ్ కృష్ణారెడ్డి విపరీత ప్రవర్తనతో శిక్షణలో కొంతమంది తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు పోలీసులు గుర్తించారు.












