Aishwarya Rajesh: కొంతమంది హీరోయిన్స్ ఎప్పుడు ఎలా సక్సెస్ అవుతారో తెలీదు. కొందరికి మంచి హిట్ దక్కినా, మళ్ళీ అవకాశాల కోసం ఆవురావురంటూ చూడాల్సి వస్తోంది. ఇటీవల, మన సౌత్ సినిమాలలో నటిస్తూ హిట్ కొట్టిన భామల పరిస్థితి ఇలాగే ఉంది. దీనికి, బోలెడన్ని లెక్కలూ ఉంటున్నాయి. అందుకే, హిట్ కొట్టిన బ్యూటీస్ కూడా కొత్త సినిమా సైన్ చేయడానికి నెలలు ఎదురు చూడాల్సి వస్తోంది.
అలాంటి వారి జాబితాలో ఐశ్వర్య రాజేష్ కూడా ఉంది. ఈ బ్యూటీ అంతకముందు తమిళ సినిమాలలో నటించి పాపులర్ అయింది. కానీ, తెలుగులో మాత్రం విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మొదటిది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి కూడా నటించింది. వెంకీ, ఐశ్వర్య, మీనాక్షిల మధ్య వచ్చే సీన్స్ సినిమాకి మేయిన్ హైలెట్‌గా నిలిచాయి.
ఇక, వెంకీ-ఐశ్వర్యల మీద చిత్రీకరించిన గోదారి గట్టుమీద రామచిలుకవే సాంగ్ కి ఎంతగా క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత టాలీవుడ్ లో సీనియర్ హీరోలకి ఐశ్చర్య మంచి ఛాయిస్ అవుతుందనుకున్నారు. కానీ, అలా జరగలేదు. ఇటీవల ఓ సుకుమారి అనే సినిమాతో వచ్చింది. కానీ, ఈ సినిమా ఐశ్వర్యను బాగా డిసప్పాయింట్ చేసింది.
అందుకే, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నాకు మంచి పేరొచ్చింది. బాక్సాఫీస్ దగ్గర మంచి కమర్షియల్ హిట్ కూడా. అయినా, నాకు అవకాశాలు ఇవ్వడం లేదని బాధపడింది. ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నదాన్ని బట్టి, బాలయ్య సినిమాలో ఓ రోల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక, హసిత్ గోలి దర్శకత్వంలో రవితేజ-శ్రీవిష్ణు హీరోలుగా దిల్ రాజు ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో, ఒక హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్‌నే అనుకున్నారు. కానీ, ఇప్పుడు డింపుల్ హయాతి వైపు మొగ్గు చూపుతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇదే, నిజమైతే ఐశూ బాధపడటంలో తప్పేమీ లేదు.












