Kollywood: తమిళ ఇండస్ట్రీలో సంచలనాత్మకమైన సినిమాలను తీసి అగ్ర దర్శకుల జాబితాలో చేరాడు లోకేష్ కనగరాజ్. మానగరం సినిమాతో దర్శకుడిగా మారిన లోకేష్..తర్వాత కార్తితో ఖైది చిత్రాన్ని తీసి హిట్ అందుకున్నాడు. అలాగే, విజయ్‌తో మాస్టర్, కమల్ హాసన్‌తో విక్రమ్, రజినీకాంత్‌తో కూలీ చిత్రాలను రూపొందించాడు. రా అండ్ రస్ట్రిక్ కల్ట్ కంటెంట్‌తో లోకేష్ సీనియర్ హీరోలకి సాలిడ్ హిట్స్ ఇచ్చాడు.
అయితే, ఈ దర్శకుడితో సినిమా ప్లానింగ్ ఉండి కూడా ఇప్పటి వరకూ క్లారిటీ లేక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు తమిళ అగ్ర కథానాయకులు సూర్య-కార్తి. కార్తితో ఖైది 2 చేయాల్సి ఉంది లోకేష్. అలాగే, సూర్యతో రోలెక్స్ అనే సినిమాను చేయాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకూ వీటి పరిస్థితేంటీ..ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతుందా లేదా..ఇవేమీ అప్‌డేట్స్ లేవు.
ఈ రెండు ప్రాజెక్ట్స్ కంటే ముందు ఐకాన్ స్టారల్లు అర్జున్‌తో సినిమాను చేయబోతున్నాడు లోకేష్. ప్రస్తుతం, అట్లీ కుమార్‌తో రాకా చేస్తున్న బన్నీ, తర్వాత లోకేష్ సినిమాతో సెట్స్‌పైకి రానున్నాడు. ఇక, లోకేష్ కూడా దీని తర్వాత కమల్ హాసన్‌తో విక్రమ్ 2 చేయాలనే ప్లానింగ్ లో ఉన్నాడు. దర్శకుడిగా మాత్రమే కాకుండా ప్రజెంటర్‌గా, హీరోగానూ లోకేష్ బిజీ.
ఇలాంటి, పరిస్థితుల్లో లోకేష్ కోసం ఎదురుచూస్తున్న ఈ అన్నదమ్ముల సంగతేంటీ? అని కోలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సూర్య నటించిన విశ్వనాథ్ & సన్స్ ఈ ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. అలాగే, కార్తి నటించిన సర్దార్ 2 కూడా సెప్టెంబర్ లో రిలీజ్ ఉంది. ఆ తర్వాత కూడా వీరిద్దరు వరుస సినిమాలతో బిజీగానే ఉన్నారు. కానీ, లోకేష్ కనగరాజ్ మూవీస్ ఎప్పుడు అనేదే అందరికీ అర్థం కాని విషయం.












