సినిమా

Keerthy Suresh: నాన్ స్టాప్‌గా 41 గంటలపాటు..అందుకే మహానటి!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Keerthy Suresh: అప్పట్లో మన సీనియర్ హీరోలైన ఎన్‌టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు..వీరందరూ..రోజులో కనీసం 18 గంటలు షూటింగ్స్ లో గడిపేవారు. వీరు మాత్రమే కాదు, అలనాటి హీరోయిన్స్, సావిత్రి..జమునరాణి..కాంచన..భానుమతి రామకృష్ణ, విజయనిర్మల..వీరు కూడా ఇలా 18 గంటల పాటు షూటింగ్స్‌లో గడిపినవారే.

Keerthy Suresh: అప్పట్లో మన సీనియర్ హీరోలైన ఎన్‌టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు..వీరందరూ..రోజులో కనీసం 18 గంటలు షూటింగ్స్ లో గడిపేవారు. వీరు మాత్రమే కాదు, అలనాటి హీరోయిన్స్, సావిత్రి..జమునరాణి..కాంచన..భానుమతి రామకృష్ణ, విజయనిర్మల..వీరు కూడా ఇలా 18 గంటల పాటు షూటింగ్స్‌లో గడిపినవారే.

వీరితో పాటుగా క్యారెక్టర్స్ చేసే సీనియర్స్ కూడా ఇలాగే షూటింగ్స్‌లో పాల్గొన్నారు. ఒకే రోజు మూడు షిఫ్టుల్లో పనిచేసి ఏడాదికి 10 నుంచి 12 సినిమాలు రిలీజ్ అయ్యేలా కష్టపడ్డారు. అంతేకాదు, సినిమా సినిమాకి గ్యాప్ ఏమాత్రం ఉండేది కాదు. అందుకే, వారు సూపర్ స్టార్స్‌గా వందల సినిమాలను చేశారు.

ఆ తర్వాత జనరేషన్‌లో చిరంజీవి ఇలాగే మూడు షిఫ్టుల్లో సినిమాలు చేశారు. రాధ, విజయశాంతి, రాధిక, మాధవి, సుమలత లాంటి హీరోయిన్స్..అన్నపూర్ణమ్మ, నిర్మలమ్మ లాంటి వారూ ఎంతో శ్రమించారు. కానీ, ఇప్పుడు 8 గంటల పని మాత్రమే ఉండాలని కొందరు హీరోయిన్స్ అంటున్నారు. వారు అలా అనడం ఎంతవరకూ కరెక్టో ఒక్కసారి పాత కాలం నటీనటులను చూస్తే అర్థమవుతుంది.

అయితే, మహానటి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని, అవార్డులు అందుకున్న కీర్తి సురేష్ మాత్రం..సినిమా ఉంటే ఏకధాటిగా షూటింగ్స్‌లో పాల్గొంటుంది. తాజాగా, ఆమె విషయాన్ని బయటపెట్టింది. నాన్ స్టాప్‌గా 41 గంటలపాటు కంటి మీద కునుకు లేకుండా రెండు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొన్నదట. స్వయంగా కీర్తి ఈ మాటలు చెప్పడంతో..ఆమె అభిమానులు 8 గంటల పని గురించి మాట్లాడిన వారిని ట్రోల్ చేస్తున్నారు. అందుకే, మీరు మహానటి అంటూ కీర్తిని కీర్తిస్తున్నారు. కాగా, ఇప్పుడు తెలుగులో రౌడీ జనార్ధన, వెంకీ-అనిల్ రావిపూడి సినిమా చేస్తోంది. అలాగే, ఆమె తమిళంలో నటించిన దోరొతి ఈ నెలలోనే రిలీజ్ కాబోతోంది. అలాగే, నానితో ది ప్యారడైజ్ సినిమాలో ఐటం సాంగ్‌తో అలరించడానికి కూడా రెడీ అవుతోంది.

#KeerthySuresh#Dorothi#TheParadaise#RowdyJanardhana#Venkey-Anil
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి