సినిమా

Pawan Kalyan: ఓజీ 2పై థమన్ క్లారిటీ..మీసం తిప్పాలా లేదా!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Pawan Kalyan: ఎప్పుడో మొదలయ్యే సినిమాకి హైప్ క్రియేట్ చేయ్యాలంటే అది మ్యూజిక్ సెన్షేషన్ థమన్ వల్లే సాధ్యమవుతుంది. అర్థరాత్రో..తెల్లవారు జామునో సినిమాకి సంబందించి ఓ పోస్ట్ పెట్టి ఆసక్తి రెట్టింపు చేస్తుంటాడు. లేదంటే ఒక్క ఫొటో..దానికి ఒక్క కామెంట్ ఇచ్చి వదిలేస్తాడు..అంతే, ఇక ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు, కూడా ఓజీ 2 గురించి రెండు ముక్కలు చెప్పి ఉత్సాహపరిచాడు థమన్.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనరాజు సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తిచేసుకొని ఈ నెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి హాజరైన థమన్, కొరియన్ కనకారు సినిమా గురించి మాత్రమే కాకుండా, ఓజీ 2 అప్‌డేట్ కూడా ఇచ్చాడు.

కొన్ని గంటల క్రితమే ఒక వార్త వచ్చి బాగా వైరల్ అవుతోంది. వాస్తవానికి, నానితో సుజీత్ చెయాల్సిన బ్లడీ రోమియో సెట్స్‌పైకి రావడానికి ఆలస్యం అవుతుందని, పవన్ కళ్యాణ్‌తో ఓజీ 2ని పట్టాలెక్కించడానికి సుజీత్ రెడీ అయ్యాడు. చేతిలో రెండు సినిమాల స్క్రిప్ట్ ఉన్నాయి. ఎవరు డేట్స్ ఇస్తే వాళ్ళతో రెడీ అన్నట్టుగా ఉన్నాడు. అయితే, సెప్టెంబర్ వరకూ నాని ది ప్యారడైజ్ నుంచి ఫ్రీ అవుతుండటంతో అక్టోబర్ నుంచి బ్లడీ రోమియో సెట్స్‌పైకి తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి.

దీంతో, వచ్చే ఏడాది సమ్మర్ వరకూ ఓజీ అప్‌డేట్స్ ఉండవని అందరూ అనుకున్నారు. కానీ, తాజాగా జరిగిన కొరియన్ కనకరాజు ప్రీరిలీజ్ ఈవెంట్‌లో థమన్..ఓజి 2 సినిమా అప్డేట్ కోసం సెప్టెంబర్ వరకు ఆగాలంటూ.. హామీ ఇచ్చాడు. అంతేకాదు, "మళ్ళీ గడ్డం పెంచుతున్నా, మీసం తిప్పాలా లేదా".. అంటూ పవన్ అభిమానులకి ఓజి 2 పై ఓ క్లారిటీ ఇచ్చాడు. దీన్ని బట్టి సెప్టెంబర్‌లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి గ్యారెంటీగా ఓజీ 2 అప్‌డేట్ ఉంటుందని కన్‌ఫర్మ్ అయింది.

#pawankalyan#og2#ssthaman#sujeeth
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి