సినిమా

Buchi Babu Sana: నిర్మాతగా పెద్ది దర్శకుడు?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Buchi Babu Sana: సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పలు సూపర్ హిట్ చిత్రాలకి పనిచేసిన బుచ్చిబాబు సానా, ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. మొదటి సినిమానే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఒక డెబ్యూ హీరోగా పంజా వైష్ణవ్ తేజ్ ఏళ్ళ నుంచి ఉన్న రికార్డ్స్ ని బద్దలు కొట్టాడు. ఈ క్రెడిట్ బుచ్చిబాబుదే. కృతి శెట్టి ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. విజయ్ సేతుపతికి అద్భుతమైన పాత్రను రాశాడు.

అలా, మొదటి సినిమాతో బుచ్చిబాబు చాలానే రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చింది పెద్ది. క్రీడా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటించింది. రెండు విభిన్నమైన క్రీడల్లో చరణ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో చరణ్ పోషించిన పాత్రలకి అవార్డులు గ్యారెంటీగా వస్తాయనే మాటలు బలంగా వినిపించాయి. ఇదిలా, ఉంటే బుచ్చిబాబు నెక్స్ట్ సినిమాను ఏ హీరోతో ప్రకటిస్తాడో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

కానీ, తాజా సమాచారం మేరకు, ఈసారి బుచ్చిబాబు నిర్మాతగా మారనున్నాడట. ఇది, సుకుమార్‌ను ఫాలో అవుతున్నట్టుగా ఉందని కొందరు అంటున్నారు. సుక్కూ కూడా దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్న తర్వాత సుకుమార్ రైటింగ్స్ పేరుతో నిర్మాత అయ్యాడు. మైత్రీ వారితో కలిసి సినిమాలను నిర్మిస్తున్నాడు. కుమారి 21 ఎఫ్ లాంటి సినిమాకి సుక్కూ నిర్మాణ భాగస్వామి.

బుచ్చిబాబు కూడా మంచి కథలను అందిస్తూ, తన నిర్మాణంలో కొత్త వారిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకుంటున్నాడట. నిర్మాతగా చేయబోయో మొదటి సినిమాకి తన బంధువును హీరోగా ఇండట్రీకి పరిచయం చేయాలనుకుంటున్నట్టుగా ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. మరి, అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ను బుచ్చిబాబు ఎప్పుడు ప్రకటిస్తాడో..ఆ హీరో ఎవరో చూడాలి.

#buchibabu sana#peddi#sukumar#uppena#ram charan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి