సినిమా

Epic Movie: రొమాంటిక్ లవ్‌స్టోరీకి రిలీజ్ డేట్ ఫిక్స్

రచన: Anshu4 నిమిషాల పఠనం

Epic Movie: బేబి సినిమాతో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య టాలీవుడ్ లో ఎంతగా పాపులర్ అయ్యారో అందరికీ తెలిసిందే. లవ్, చీటింగ్, ఎమోషనల్ కంటెంట్ తో సాయి రాజేష్ రూపొందించిన ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా తర్వాత ఆనంద్, వైష్ణవికి విపరీతమైన క్రేజ్ వచ్చింది.

Epic Movie: బేబి సినిమాతో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య టాలీవుడ్ లో ఎంతగా పాపులర్ అయ్యారో అందరికీ తెలిసిందే. లవ్, చీటింగ్, ఎమోషనల్ కంటెంట్ తో సాయి రాజేష్ రూపొందించిన ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా తర్వాత ఆనంద్, వైష్ణవికి విపరీతమైన క్రేజ్ వచ్చింది.

అయితే, ఆ క్రేజ్ కి తగ్గ సినిమాలు మళ్ళీ వీరిద్దరికీ పడలేదు. బేబీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ కి గానీ, వైష్ణవికి గానీ సాలీడ్ హిట్ దక్కలేదు. వైష్ణవి చైతన్య బేబీ తర్వాత లవ్ మీ, జాక్ చిత్రాలను చేసింది. ఈ రెండు సినిమాలు ఫ్లాపైయ్యాయి. ఆనంద్ మాత్రం ఒక సినిమా చేసినప్పటికీ, అది ఎవరికీ గుర్తు లేదు. ఇలాంటి, నేపథ్యంలో మళ్ళీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి 'ఎపిక్' మూవీ చేస్తున్నారు.

ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి హైప్ ని క్రియేట్ చేసింది. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి, ఫస్ట్ సెమిస్టర్ అనే ట్యాగ్ లైన్ ఆసక్తికరంగా ఉంది. ఇక, ఈ మూవీతో ’90’స్ – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను మెప్పించిన ఆదిత్య హాసన్ దర్శకుడిగా రాబోతున్నాడు. యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించాడు.

మళ్ళీ, బేబీ కాంబినేషన్ రిపీటవడంతో సినిమాపై ఇప్పటి వరకైతే బాగానే అంచనాలు ఉన్నాయి. కాగా, తాజాగా ఈ సినిమాకి రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించారు. దీనితోపాటు సరికొత్త పోస్టర్ కూడా వదిలారు. ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తో గ్యారెంటీగా ఆనంద్ అండ్ వైష్ణవిలకి సాలీడ్ హిట్ దక్కుతుందనిపిస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. హెషామ్ అబ్దుల్ వహాబ్ సంగీత దర్శకుడు.

#EpicNovie#AnandDevarakonda#VaishnaviChaithanya
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి