రాజకీయాలు

BJP Lost: మూడు చోట్ల పోటీ.. రెండు చోట్ల ఓటమి.. అధికారంలో ఉండి కూడా.. బీజేపీకి వార్నింగ్ బెల్స్

రచన: NK5 నిమిషాల పఠనం

BJP Lost: మూడు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓటమి ఎదురైంది. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉండి కూడా బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ పరిణామం ఇప్పుడు బీజేపీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. అసలు బీజేపీకి ఎందుకు పరాభవం ఎదురైంది అన్న విశ్లేషణ మొదలైంది. ఇవాళ మూడు రాష్ట్రాల్లో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి.

BJP Lost: మూడు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓటమి ఎదురైంది. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉండి కూడా బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ పరిణామం ఇప్పుడు బీజేపీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. అసలు బీజేపీకి ఎందుకు పరాభవం ఎదురైంది అన్న విశ్లేషణ మొదలైంది. ఇవాళ మూడు రాష్ట్రాల్లో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి.

గుజరాత్ (మంజల్ పూర్), మధ్యప్రదేశ్ (దాటియా), బిహార్ (బంకీపూర్) రాష్ట్రాల్లో మూడు శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ మూడు రాష్ట్రాల్లో కమలం పార్టీ పవర్ లో ఉంది. ఉప ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. మూడు చోట్ల పోటీ చేసిన బీజేపీకి.. రెండు చోట్ల పరాభవం ఎదురైంది. గుజరాత్‌లో మాత్రమే కమలం వికసించింది. బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఆ పార్టీ అభ్యర్థుల ఓటమి పాలయ్యారు. ఇప్పుడీ వ్యవహారం బీజేపీ శ్రేణుల్లోనే కాదు రాజకీయవర్గాల్లోనూ చర్చకు దారితీసింది. ఈ ఓటమికి కారణాలు ఏమై ఉండొచ్చు అని అంతా చర్చించుకుంటున్నారు.

బిహార్ లోని బంకీ పూర్.. బీజేపీకి కంచుకోట. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. 30ఏళ్లుగా ఇక్కడ బీజేపీదే అధిపత్యం. అలాంటి కంచుకోటను ప్రశాంత్ కిశోర్ బద్దలు కొట్టారు. అక్కడ బీజేపీ అభ్యర్థిపై ప్రశాంత్ కిశోర్ ఘన విజయం సాధించారు. మధ్యప్రదేశ్ లోని దాటియాలో బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీపై కాంగ్రెస్ అభ్యర్థి ఘన్ శ్యామ్ సింగ్ విజయం సాధించారు. ఈ రెండు చోట్ల బీజేపీకి ఓటమి ఎదురవగా.. గుజరాత్ రాష్ట్రంలో మాత్రమే కమలం పార్టీకి ఊరట లభించింది. మంజల్ పూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి భికభాయ్ పై బీజేపీ అభ్యర్థి సతేంద్రభాయ్ పటేల్ 30వేలకు పైగా ఓట్లతో విక్టరీ సాధించారు.

బిహార్, మధ్యప్రదేశ్, గుజరాత్.. ఈ మూడు చోట్ల బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అయినా 2చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోవటం బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బగానే భావించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అధికారంలో ఉండి కూడా బీజేపీ ఓడిపోవడానికి పలు కారణాలను ప్రస్తావిస్తున్నారు పొలిటికల్ అనలిస్టులు. జెన్ జీ ఉద్యమం, విద్యార్థుల నిరసనలు బీజేపీపై ప్రభావం చూపాయని కొందరు అంటుంటే.. స్థానిక ప్రభుత్వాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఓటములకు ప్రధాన కారణమని మరికొందరు విశ్లేషిస్తున్నారు.

బిహార్ విషయానికి వస్తే.. అక్కడ అభ్యర్థి మార్పు, భరత్ తివారీ ఎన్ కౌంటర్, విద్యార్థులపై లాఠీచార్జ్ అంశాలు బీజేపీ ఓటమికి, ప్రశాంత్ కిశోర్ విజయానికి ప్రధాన కారణాలుగా అంచనా వేస్తున్నారు. మొత్తంగా బీజేపీ అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చిందని, ప్రాథమిక సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధం కావాలని పార్టీ నాయకులు చెబుతున్నారు. సమీప భవిష్యత్తులో ప్రభుత్వం, పార్టీ వ్యవస్థ రెండింటిలోనూ గణనీయమైన మార్పులు తప్పదంటున్నారు.

#Bjp#Bypoll Results#By Election Results#Bankipur#Manjalpur#Datia#Gujarat#Madhya Pradesh#Bihar#Gen Z#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి